మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా క్రైస్ట్ చర్చ్ వేదికగా భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది. తొలి వన్డేలో కివీస్ జట్టు నెగ్గగా.. రెండో వన్డే వర్షంతో రద్దయ్యింది. ఇక, మూడో మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. వరుసగా శిఖర్ ధావన్ టాస్ ఓడిపోవడం ఇది మూడో సారి. రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతుంది. దీంతో.. మరోసారి సంజూ శాంసన్ కు నిరాశ ఎదురుకానుంది. మరోవైపు.. న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. మైకేల్ బ్రేస్ వేల్ స్థానంలో ఆడమ్ మిల్నే తిరిగి జట్టులోకి వచ్చాడు.
అయితే.. వర్షం మరోసారి కీ రోల్ ప్లే చేయనుంది.ఒకవేళ వర్షం కారణంగా ఈ సిరీస్ ను న్యూజిలాండ్ కోల్పోయే అవకాశం అయితే లేదు. ఇక సిరీస్ ను సమం చేయాలంటే భారత్ తప్పనిసరిగా మూడో వన్డేలో నెగ్గాల్సి ఉంది. వర్షంతో రద్దయినా.. లేదా ఓడినా సిరీస్ కివీస్ వశం అవుతుంది.భారత్, న్యూజిలాండ్ సిరీస్ కు వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. వర్షం చినుకు లేకుండా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచ్ కు కూడా వాన అడ్డుపడుతూనే ఉంది.
Bowling first in Christchurch after a toss win for Kane Williamson at Hagley Oval. Follow play LIVE in NZ with @sparknzsport + @TodayFM_nz and in India with @PrimeVideoIN. LIVE scoring | https://t.co/4RzQfI5r5X #NZvIND pic.twitter.com/JVUAPJmxfj
— BLACKCAPS (@BLACKCAPS) November 30, 2022
టి20 సిరీస్ లో తొలి టి20 రద్దు కాగా.. మూడో టి20 వర్షంతో పూర్తిగా సాగలేదు. ఇక రెండో వన్డే వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఈ పర్యటనలో చివరిదైన మూడో వన్డే అయినా సజావుగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.క్రైస్ట్ చర్చ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు కూడా వాన గండం పొంచి ఉంది. ఈ డే అండ్ నైట్ మ్యాచ్ లో భారీ వర్షం కురిసే ఛాన్సులు లేకపోయినా.. చిరుజల్లులు అంతరాయం కలిగించే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు.
దీంతో.. మరోసారి డక్ వర్త్ లూయిస్ మెథడ్ కీలకం కానుంది. డక్ వర్త్ లూయిస్ పద్దతిన మ్యాచ్ ఫలితం తేలాలంటే రెండో ఇన్నింగ్స్ లో కనీసం 20 ఓవర్ల ఆట పూర్తయ్యి ఉండాలి. ఇక వర్షంతో మూడో వన్డే జరగకపోతే సిరీస్ కివీస్ వశం అవుతుంది. రెండో ఇన్నింగ్స్ లో వర్షం పడే అవకాశం ఉండటంతో టాస్ కీలకంగా మారనుంది.
టీమిండియాలో శిఖర్ ధావన్, గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కీలకం కానున్నారు. బౌలింగ్ లో అర్ష్ దీప్, ఉమ్రాన్, దీపక్ చాహర్ కీ రోల్ ప్లే చేయనున్నారు. మరోవైపు.. న్యూజిలాండ్ టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, ఫిన్ అలెన్ లతో స్ట్రాంగ్ గా కన్పిస్తుంది. బౌలింగ్ లో టీమ్ సౌతీ, అడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, లూకీ ఫెర్గ్యూసన్ టీమిండియాకు సవాల్ విసరనున్నారు.
తుది జట్లు :
టీమిండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, చహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, అడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లూకీ ఫెర్గ్యూసన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Kane Williamson, Sanju Samson, Shikhar Dhawan