హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ: ఒకే స్కోర్ వద్ద మూడు వికెట్లు.. పుజార, కోహ్లీ డకౌట్.. కెప్టెన్ కోహ్లీ అవుట్‌పై అనుమానాలు.. కష్టాల్లో ఇండియా

IND vs NZ: ఒకే స్కోర్ వద్ద మూడు వికెట్లు.. పుజార, కోహ్లీ డకౌట్.. కెప్టెన్ కోహ్లీ అవుట్‌పై అనుమానాలు.. కష్టాల్లో ఇండియా

పుజార, కోహ్లీ డకౌట్.. కష్టాల్లో టీమ్ ఇండియా (PC: BCCI)

పుజార, కోహ్లీ డకౌట్.. కష్టాల్లో టీమ్ ఇండియా (PC: BCCI)

IND vs NZ: ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. భారత జట్టుకు శుభారంభం లభించినా.. ఒకే స్కోర్ వద్ద మూడు వికెట్లు పడ్డాయి. పుజార, కోహ్లీ డకౌట్‌గా వెనుదిరగడంలో భారత జట్టు కష్టాల్లో పడింది. అగర్వాల్ అర్ద సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.

ఇంకా చదవండి ...

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో (World Test Championship) భాగంగా ముంబైలో ఇండియా - న్యూజీలాండ్ (India vs New Zealand) జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్నది. వర్షం కారణంగా మైదానం అంతా తడిగా ఉండటంతో తొలి సెషన్ మొత్తం రద్దు చేశారు. ఇక టీమ్ ఇండియా (Team India) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత జట్టుకు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్ (Shubhman gil), మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ సమయోచితంగా ఆడుతూ కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. బౌండరీలు, సిక్సులు కొడుతూ ఇండియా స్కోరును పెంచారు. తొలి టెస్టులో కివీస్ పేస్ బౌలర్లు చక్కగా స్వింగ్ చేసి వికెట్లు తీశారు. కానీ ఈ మ్యాచ్‌లో వారిని ఓపెనర్లు ధీటుగా ఎదుర్కున్నారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజులో పాతుకొని పోవడంతో న్యూజీలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌ను రంగంలోకి దించాడు. మొదటి నుంచి గిల్ అతడిని ఎదుర్కోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. ఒక సారి పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత బంతికే శుభ్‌మన్ గిల్ (44) అజజ్ పటేల్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

28వ ఓవర్‌లో గిల్‌ను అవుట్ చేసిన అజాజ్ పటేల్.. 30వ ఓవర్‌లో మరింతగా రెచ్చిపోయాడు. నయావాల్ చతేశ్వర్ పుజార  (Chateshwar Pujara)(0) అజాజ్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పుజార కూడా అంతకు ముందు బంతికే ఎల్బీడబ్ల్యూ ప్రమాదం నుంచి తప్పించుకోవడం గమనార్హం. ఇక తొలి టెస్టుకు విశ్రాంతి తీసుకొని బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (Virat Kohli) (0) అత్యంత అనుమానాస్పదంగా అవుట్ అయ్యాడు. అజాజ్ పటేల్ వేసిన బంతి కోహ్లీ ప్యాడ్లకు తాకిందని కివీస్ అప్పీల్ చేసింది. దీంతో అంపైర్ అనిల్ చౌదరి అవుట్ ఇచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ రివ్యూ కోరాడు.

IND vs NZ: 2వ టెస్టు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. గాయం కారణంగా ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్చాలా సేపు థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ ఫుటేజ్ పరిశీలించాడు. అన్ని యాంగిల్స్‌లో వీడియోను గమనించాడు. చూడటానికి బంతి ముందు బ్యాటుకు తగిలినట్లే అనిపించింది. అయితే ఫుటేజీతో అంపైర్ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. దీంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయానికే కట్టుబడి కోహ్లీని అవుట్ ఇచ్చారు. మంచి శుభారంభం చేసిన భారత జట్టు 80 పరుగుల వద్దే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ మూడు వికెట్లను కూడా అజాజ్ పటేల్ తీసి టీమ్ ఇండియాను దెబ్బకొట్టాడు. రెండో ముగిసే సరికి టీమ్ ఇండియా 11/3 స్కోర్ వద్ద ఉన్నది. మయాంక్ అగర్వాల్ (52), శ్రేయస్ అయ్యర్ (7) క్రీజులో ఉన్నారు.

Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ ఈ సారైనా టైటిల్ సాధించేనా? జట్టులో ఉన్నదెవరు? టైటాన్స్ మ్యాచ్ షెడ్యూల్ ఇదేఇక టెస్టుల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చెత్త రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. అంతకు ముందు న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ 13 సార్లు డకౌట్ అయి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌తో కలసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్, దక్షాణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోన్యే, ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 8 డకౌట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Cheteswar Pujara, India vs newzealand, Team India, Test Cricket, Virat kohli

ఉత్తమ కథలు