హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 2nd T20 : టాస్ నెగ్గిన న్యూజిలాండ్.. సంజూ సామ్సన్, గిల్ కు నిరాశ.. తుది జట్లు ఇవే

IND vs NZ 2nd T20 : టాస్ నెగ్గిన న్యూజిలాండ్.. సంజూ సామ్సన్, గిల్ కు నిరాశ.. తుది జట్లు ఇవే

PC : BCCI

PC : BCCI

IND vs NZ 2nd T20 : భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా జరగాల్సిన తొలి టి20 వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. రోజు విరామం తర్వాత రెండు జట్లు కూడా రెండో టి20కి సిద్ధమయ్యాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 2nd T20 : భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా జరగాల్సిన తొలి టి20 వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. రోజు విరామం తర్వాత రెండు జట్లు కూడా రెండో టి20కి సిద్ధమయ్యాయి. మౌంట్ మాంగనూయ్ వేదికగా జరిగే రెండో టి20 జరగనుంది.  ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం బౌల్ట్ స్థానంలో ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. ఇక సంజూ సామ్సన్ కు మరోసారి నిరాశే మిగిలింది. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో అద్భుతంగా ఆడిన అతడిని మరోసారి టీం పక్కనబెట్టింది.

ఊహించని విధంగా కూర్పు

న్యూజిలాండ్ తో జరిగే రెండో టి20లో టీమిండియా కూర్పు ఊహించని విధంగా ఉంది. తుది జట్టులో సంజూ సామ్సన్, శుబ్ మన్ గిల్ ఆడతారని అంతా అనుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా టీమిండియా నిర్ణయం తీసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా ఆడిన సంజూ సామ్సన్ ను మరోసారి బెంచ్ కే పరిమితం చేసింది. ఇషాన్ కిషన్, దీపక్ హుడాలకు అవకాశం ఇచ్చింది. శ్రేయస్ అయ్యర్, సిరాజ్ లు జట్టులోకి వచ్చారు. ఇక అదే సమయంలో ఉమ్రాన్ మాలిక్ కూడా అవకాశం రాలేదు. ఇక మరోవైపు న్యూజిలాండ్ బౌల్ట్ స్థానంలో మిల్నేకు అవకాశం ఇచ్చింది. ఈ మార్పు మినహా మిగిలిన టీం టి20 ప్రపంచకప్ లో ఆడిన జట్టే కావడం విశేషం.

తుది జట్లు

టీమిండియా

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్,  ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సుందర్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్

న్యూజిలాండ్

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్,  డారిల్ మిచెల్, నీషమ్, సాంట్నెర్, సోధి, సౌతీ, ఫెర్గూసన్, ఆడం మిల్నే.

First published:

Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Kane Williamson, Rishabh Pant, Sanju Samson

ఉత్తమ కథలు