IND vs NZ 2nd T20 : వన్డే సిరీస్ లో వైట్ వాష్ అయిన న్యూజిలాండ్ (New Zealand).. భారత్ (India)తో జరిగిన తొలి టి20లో మాత్రం అదరగొట్టింది. రాంచీ వేదికగా జరిగిన తొలి టి20లో 21 పరుగుల తేడాతో భారత్ ను ఓడించి సిరీస్ లో శుభారంభం చేసింది. ఇక ఇప్పుడు లక్నో వేదికగా జరిగే రెండో టి20లో నెగ్గి సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఉంది. అదే సమయంలో తొలి టి20లో ఎదురైన ఓటమి నుంచి కోలుకుని రెండో టి20లో గెలవాలనే పట్టుదల మీద భారత్ కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. ఉమ్రాన్ మాలిక్ ను పక్కన పెట్టి యుజువేంద్ర చహల్ ను తుది జట్టులోకి తీసుకుంది. పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది.
ఇది కూడా చదవండి : సంజూ సామ్సన్ అభిమానులకు అదరిపోయే న్యూస్.. అందులో పాస్ అయిన మిస్టర్ కూల్
పృథ్వీ షాకు నిరాశ
మరోసారి పృథ్వీ షాకు నిరాశే ఎదురైంది. తొలి టి20లో భారత బ్యాటింగ్ ఫ్లాప్ షో కనబర్చడంతో రెండో టి20లో దూకుడుగా ఆడే పృథ్వీ షాకు అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. అయితే పృథ్వీ షాకు మాత్రం మరోసారి నిరాశే మిగిలింది. అతడికి తుది జట్టులో అవకాశం కల్పించలేదు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ మరో స్పెషలిస్టు స్పిన్నర్ తో బరిలోకి దిగింది. తొలి టి20లో ఏ మాత్రం ప్రభావం చూపని ఉమ్రాన్ మాలిక్ ను పక్కన పెట్టి అతడి స్థానంలో యుజువేంద్ర చహల్ ను తుది జట్టులోకి తీసుకుంది. దాంతో కుల్చా ద్వయం మరోసారి బరిలోకి దిగనుంది. ఇక న్యూజిలాండ్ మాత్రం ఎటువంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగనుంది. రెండో టి20లోనూ నెగ్గి సిరీస్ ను ఇక్కడే పట్టేస్తామని కెప్టెన్ సాంట్నెర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తుది జట్లు
న్యూజిలాండ్
అలెన్ ఫిన్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, చాప్ మన్, డారిల్ మిచెల్, బ్రేస్ వెల్, సాంట్నెర్, ఫెర్గూసన్, డఫీ, సోధి, టిక్నర్
టీమిండియా
ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, అర్ష్ దీప్, కుల్దీప్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Prithvi shaw, Shubman Gill