హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 2nd T20 : కివీస్ తో రెండో టి20.. వీరిద్దరికీ ఛాన్స్ కష్టమే.. టీమిండియా తుది జట్టు ఇదే

IND vs NZ 2nd T20 : కివీస్ తో రెండో టి20.. వీరిద్దరికీ ఛాన్స్ కష్టమే.. టీమిండియా తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs NZ 2nd T20 : వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి టి20 వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. రోజు విరామం తర్వాత మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా రెండో టి20కి ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand).. పర్యాటక భారత్ (India) జట్లు సిద్ధమయ్యాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 2nd T20 : వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి టి20 వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. రోజు విరామం తర్వాత మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా రెండో టి20కి ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand).. పర్యాటక భారత్ (India) జట్లు సిద్ధమయ్యాయి. మౌంట్ మాంగనూయ్ వేదికగా రెండో టి20 ఆదివారం జరగనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో గెలిచి మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు కూడా పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు డీడీ స్పోర్ట్స్ చానెల్స్ ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

ఆ ఇద్దరికీ ఛాన్స్ కష్టమే

తొలి టి20 జరగకపోవడంతో రెండో టి20లో జట్టు మార్పులపై చెప్పడం కష్టం. తొలి టి20 టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఈ నేపథ్యంలో తొలి టి20లో బరిలోకి దిగాలనుకున్న జట్టుతోనే రెండో టి20లో టీమిండియా ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ కు, పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు నిరాశ తప్పేలా లేదు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్ వైపు హార్దిక్ పాండ్యా మొగ్గు చూపే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ ను ఓపెనర్ గా పంపితే మాత్రం అప్పుడు మిడిలార్డర్ లో సంజూ సామ్సన్ కు అవకాశం వస్తుంది. ఇక స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్ లు బరిలోకి దిగే అవకాశం ఉంది.

వాతావరణం ఎలా ఉంది?

ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అక్కడి వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో మౌంట్ మాంగనూయ్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములతో వాన పడేతుందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో రెండో టి20 కూడా జరిగేది అనుమానంగానే ఉంది. తొలి టి20లా టాస్ కూడా పడకుండానే రద్దయినా ఆశ్చర్యపోనక్కర్లేదు

ఇది కూడా చదవండి : ఈ ముగ్గురిపై కన్నేసిన సన్ రైజర్స్.. ఎంతైనా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధం!

టీమిండియా తుది జట్టు (అంచనా)

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్/సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సుందర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్

First published:

Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Rishabh Pant, Sanju Samson

ఉత్తమ కథలు