IND vs NZ 2nd T20 : భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా ఆదివారం రెండో టి20 జరగనుంది. ఈ టి20కి మౌంట్ మాంగనూయ్ వేదికగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ మొదలు కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ జరిగేది ఇప్పుడు అనుమానంగా మారింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టి20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో టి20కి కూడా వాన ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయానికి మౌంట్ మాంగనూయ్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
వాతావరణం ఎలా ఉంది?
ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అక్కడి వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో మౌంట్ మాంగనూయ్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములతో వాన పడేతుందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో రెండో టి20 కూడా జరిగేది అనుమానంగానే ఉంది. తొలి టి20లా టాస్ కూడా పడకుండానే రద్దయినా ఆశ్చర్యపోనక్కర్లేదు
వీరికి ఛాన్స్ కష్టమే!
తొలి టి20 జరగకపోవడంతో రెండో టి20లో జట్టు మార్పులపై చెప్పడం కష్టం. తొలి టి20 టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఈ నేపథ్యంలో తొలి టి20లో బరిలోకి దిగాలనుకున్న జట్టుతోనే రెండో టి20లో టీమిండియా ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ కు, పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు నిరాశ తప్పేలా లేదు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్ వైపు హార్దిక్ పాండ్యా మొగ్గు చూపే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ ను ఓపెనర్ గా పంపితే మాత్రం అప్పుడు మిడిలార్డర్ లో సంజూ సామ్సన్ కు అవకాశం వస్తుంది. ఇక స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్ లు బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : ఈ ముగ్గురిపై కన్నేసిన సన్ రైజర్స్.. ఎంతైనా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధం!
టీమిండియా తుది జట్టు (అంచనా)
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్/సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సుందర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs newzealand, Kane Williamson, Rishabh Pant, Sanju Samson, Surya Kumar Yadav, Team India