IND vs NZ 2nd T20 : న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా (Team India).. టి20 సిరీస్ లో చుక్కెదురైంది. రాంచీ వేదికగా జరిగిన తొలి టి20లో కివీస చేతిలో 21 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. దాంతో సిరీస్ లో నిలవాలంటే రెండో టి20లో భారత్ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో భారత్ నెగ్గితే సిరీస్ విజేత మూడో టి20లో తేలుతుంది. అలా కాకుండా రెండో టి20లోనూ భారత్ ఓడితే మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కివీస్ వశం అవుతుంది. ఈ క్రమంలో మరోసారి ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.
ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం
ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత కొంతకాలంగా విఫలం అవుతున్న దీపక్ హుడాను పక్కనపెట్టి అతడి స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే రెండో టి20లో పృథ్వీ షా ఆడేది పక్కా. రంజీ ట్రోఫీలో టన్నుల కొద్ది పరుగులు చేసిన పృథ్వీ షా అంతర్జాతీయ వేదికపై తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. తొలి టి20లో పేలవ ప్రదర్శన చేసిన అర్ష్ దీప్ సింగ్ తో పాటు ఉమ్రాన్ మాలిక్ లకు ఇదే ఆఖరి అవకాశం. వీరు మరోసారి విఫలం అయితే మాత్రం జట్టు నుంచి తప్పించే అవకాశం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక తొలి టి20లో భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ మినహా మిగిలిన ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. ఓపెనర్లు గిల, ఇషాన్ కిషన్ లతో పాటు రాహుల్ త్రిపాఠి తొలి టి20లో విఫలం అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేసినా.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇక హార్దిక్ కూడా నిరాశ పరిచాడు. వీటిని భారత్ సరిదిద్దుకోవాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : టీమిండియాలో క్రమశిక్షణ తప్పిన ప్లేయర్.. కోచ్ ద్రవిడ్ బెత్తం పట్టాల్సిందేనా?
టీమిండియా తుది జట్టు అంచనా
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), పృథ్వీ షా, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Prithvi shaw, Team India