హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 2nd ODI : టాస్ నెగ్గిన భారత్.. తొలి వన్డేకు విరుద్దమైన నిర్ణయం తీసుకున్న రోహిత్.. తుది జట్లు ఇవే

IND vs NZ 2nd ODI : టాస్ నెగ్గిన భారత్.. తొలి వన్డేకు విరుద్దమైన నిర్ణయం తీసుకున్న రోహిత్.. తుది జట్లు ఇవే

PC : BCCI

PC : BCCI

IND vs NZ 2nd ODI : హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరిగిన తొలి వన్డే క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచింది. ఆ మ్యాచ్ లో ఏకంగా 688 పరుగలు నమోదయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 2nd ODI : హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరిగిన తొలి వన్డే క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచింది. ఆ మ్యాచ్ లో ఏకంగా 688 పరుగలు నమోదయ్యాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో శుబ్ మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో అలరిస్తే.. దానిని తలదన్నేలా కివీస్ బ్యాటర్ బ్రేస్ (BraceWell) వెల్ తన పవర్ హిట్టింగ్ తో భారత బౌలర్లను బెదరగొట్టాడు. ఆఖర్లో ఒత్తిడిని అధిగమించి నెగ్గిన భారత్ సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంల ో రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. రాయ్ పూర్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను పట్టేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక అదే సమయంలో ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని కివీస్ సిద్ధమైంది.

రెండో వన్డేలో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో పాటు రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. తొలి వన్డేలో ఆడిన జట్లతోనే ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.

బౌలింగ్ మారాలి

తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్ రెచ్చిపోయింది. ముఖ్యంగా శుబ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. దాంతో భారత్ ఏకంగా 349 పరుగులు చేసింది. ఇక కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆరంభంలో భారత బౌలర్లు రెచ్చిపోయారు. 130 పరుగులకే 6 వికెట్లను కూల్చి మ్యాచ్ లో భారత్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది. అయితే బ్రేస్ వెల్, సాంట్నెర్ ఒక్కసారిగా మ్యాచ్ గతినే మార్చేశారు. భారత బౌలర్లను అలవోకగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఒక దశలో భారత్ ఓడిపోతుందేమో అనిపించింది. అయితే సిరాజ్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీయడంతో పాటు ఆఖర్లో బ్రేస్ వెల్ ఎల్బీగా వెనుదిరగడంతో భారత్ గెలిచి ఊపిరిపీల్చుకుంది. గత కొంత కాలంగా భారత బౌలర్లు ఆఖర్లో చేతులెత్తేస్తున్నారు. దీనిని మార్చుకోవాల్సి ఉంది. లేదంటే ఇదే ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ లో భారత్ ను ఓడించే అవకాశం ఉంది.

తుది జట్లు

టీమిండియా 

రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, శార్దుల్ ఠాకూర్

న్యూజిలాండ్

టామ్ లాథమ్ (కెప్టెన్,) అలెన్, కాన్వే, నికోలస్, మిచెల్, ఫిలిప్స్, బ్రేస్ వెల్, సాన్ ట్నర్, ఫెర్గూసన్, టిక్నర్

First published:

Tags: Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Mohammed Siraj, Rohit sharma, Shubman Gill, Surya Kumar Yadav, Team India, Virat kohli

ఉత్తమ కథలు