Home /News /sports /

IND vs NZ: తొలి టెస్టు డ్రా.. అద్భుతంగా మ్యాచ్‌ను కాపాడిన టెయిలెండర్లు.. చివరి వికెట్ తీయలేకపోయిన ఇండియా

IND vs NZ: తొలి టెస్టు డ్రా.. అద్భుతంగా మ్యాచ్‌ను కాపాడిన టెయిలెండర్లు.. చివరి వికెట్ తీయలేకపోయిన ఇండియా

డ్రాగా ముగిసిన ఇండియా - న్యూజీలాండ్ తొలి టెస్టు (PC: BCCI)

డ్రాగా ముగిసిన ఇండియా - న్యూజీలాండ్ తొలి టెస్టు (PC: BCCI)

IND vs NZ: కాన్పూర్ వేదికగా ఇండియా - న్యూజీలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగి డ్రాగా ముగిసింది. ఆఖరి ఓవర్.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠతగా సాగిన మ్యాచ్ కివీస్ టెయిలెండర్ల పోరాటంతో డ్రా అయ్యింది.

  కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం (Green Park Stadium) వేదికగా ఇండియా - న్యూజీలాండ్ (India vs New Zealand) మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. టీమ్ ఇండియాకు (Team India) గెలిచే అవకాశం ఉన్నా.. ఆఖర్లో న్యూజీలాండ్ టెయిలెండర్లు అద్బుతమైన పోరాటాన్ని చూపించారు.  టీమ్ ఇండియా నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని 5వ రోజు 4/1 ఓవర్‌ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ జట్టు (New Zealand) పూర్తి నిలకడగా ఆడింది. వికెట్లు పడకుండా భారత బౌలర్లపై కివీస్ బ్యాటర్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడారు. లాథమ్, సోమర్ విల్లే కలసి తొలి సెషన్‌లో అసలు వికెట్ పడకుండా కాపాడుకుంటూనే పరుగులు రాబట్టారు. దీంతో లంచ్ విరామ సమయానికి న్యూజీలాండ్ జట్టు వికెట్ ఏమీ కోల్పోకుండా 79/1 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్నది. రెండో సెషన్ ప్రారంభమైన తర్వాత తొలి బంతికే ఉమేష్ యాదవ్ ఇండియాకు బ్రేక్ అందించాడు. సోమర్ విల్లే (36) భారీ షాట్‌కు ప్రయత్నించి శుభ్‌మన్ గిల్ చేతికి క్యాచ్ అందించాడు.

  తర్వాత టామ్ లాథమ్, కేన్ విలియమ్‌సన్ పూర్తిగా డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఓపెనర్ టామ్ లాథమ్ మరో సారి అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. లాథమ్, కేన్ కలసి 39 పరుగులు జోడించారు. టామ్ లాథమ్ (52) రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరి కొద్ది సేపటిలో టీ విరామం వస్తుందనగా.. రాస్ టేలర్ (2) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అప్పటికి న్యూజీలాండ్ స్కోర్ 125/4.

  Virushka : ప్రేమంటే ఇదే కదా.. రొమాంటిక్ ఫోటోతో భార్య అనుష్కపై ప్రేమ కురిపించిన విరాట్ కోహ్లీ..


  చివరి సెషన్‌లో న్యూజీలాండ్ 159 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇండియా గెలవాలంటే 5 వికెట్లు అవసరం పడింది. చివరి సెషన్ ప్రారంభమైన కొద్ది సేపటికే కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (24) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఇక ఆ తర్వాత టామ్ బ్లండెల్ (2) కూడా నిరాశ పరిచాడు. అశ్విన్ బౌలింగ్‌లో బ్లండెల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన చేసిన కైల్ జేమిసన్ (5) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. టిమ్ సౌథీ (4) కూడా తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆఖరి వికెట్ తీస్తే భారత జట్టుకు విజయం వరించేది. కానీ రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అద్భుతమైన పోరాటం చేశారు. బ్యాటర్ చుట్టూ ఫీల్డర్లను మోహరించి స్పిన్నర్లతో బౌలింగ్ చేయించినా కివీస్ బ్యాటర్లు తొణకలేదు.

  Hardik Pandya : " ప్లీజ్ నన్ను జట్టులోకి ఎంపిక చేయకండి " .. హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం..


  మరోవైపు వెలుతురు తగ్గిపోతుండటంతో ప్రతీ ఓవర్‌కు హై డ్రామా నెలకొన్నది. అంపైర్లు ప్రతీ ఓవర్‌కు లైట్ చెక్ చేస్తూ మ్యాచ్‌ను ముందుకు నడిపించారు. 98 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్ ఇక ముందుకు సాగేందుకు వీలుగా వెలుతురు లేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు. రచిన్ రవీంద్ర (18), అజాజ్ పటేల్ (2) చివర్లో అద్భుతంగా పోరాడి ఆ వికెట్ పడకుండా చూడటంతో మ్యాచ్ డ్రా అయ్యింది. 98 ఓవర్లలో కివీస్ జట్టు 9 వికెట్లు నష్టానికి 165 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 4, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
  Published by:John Kora
  First published:

  Tags: India vs newzealand, Team india, Test Cricket

  తదుపరి వార్తలు