IND vs NZ 1st T20 : న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా (Team India).. టి20 సిరీస్ లోనూ అదరగొట్టేందుకు సిద్ధమైంది. రాంచీ వేదికగా మరికాసేపట్లో తొలి టి20 జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardi Pandya) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. డ్యూ ఫ్యాక్టర్ కారణంగా తాను ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు హార్దిక్ పాండ్యా తెలిపాడు. రంజీల్లో పరుగులు సాధించి జట్టులోకి వచ్చిన పృథ్వీ షా (Prithvi Shah), సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (Yuzvender Chahal)కు తుది జట్టులో చోటు లభించలేదు.
సీనియర్లు లేకుండానే
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో సీనియర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లతో పాటు సిరాజ్, మొహమ్మద్ షమీలు టి20ల్లో ఆడటం లేదు. దాంతో యువ ప్లేయర్లతో టీమిండియా కివీస్ తో టి20 సిరీస్ ఆడనుంది. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా.. వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు ఇది రెండో సిరీస్. ఈ క్రమంలో శ్రీలంకపై ఆడినట్లే ఇక్కడ కూడా ఆడి సిరీస్ ను సొంతం చేసుకోవాలనే పట్టుదల మీద కివీస్ ఉంది. వన్డే సిరీస్ లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన న్యూజిలాండ్ కనీసం టి20ల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. ఇక టి20ల్లో కెప్టెన్ గా సాంట్నెర్ వ్యవహరించనున్నాడు.
ఆ ఇద్దరికీ నిరాశే
రంజీల్లో దంచి కొట్టి టీమిండియా పిలుపు అందుకున్న యంగ్ ఓపెనర్ పృథ్వీ షాకు తొలి టి20లో తుది జట్టులో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్, గిల్ ల రూపంలో ఓపెనర్లు ఉండటంతో టీమిండియా తరఫున మైదానంలో దిగేందుకు పృథ్వీ షాకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఇక కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉండటంతో యుజువేంద్ర చహల్ కూడా బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇక పేసర్లుగా అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావిలు వ్యవహరించనున్నారు. సుందర్, హార్దిక్, దీపక్ హుడా రూపంలో ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారు.
తుది జట్లు
న్యూజిలాండ్
అలెన్ ఫిన్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, చాప్ మన్, డారిల్ మిచెల్, బ్రేస్ వెల్, సాంట్నెర్, ఫెర్గూసన్, డఫీ, సోధి, టిక్నర్
టీమిండియా
ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, అర్ష్ దీప్, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Surya Kumar Yadav