IND vs NZ : న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ కు భారత్ (India) సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం తొలి టి20 జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు అక్కడకు చేరుకుని సాధన చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రోజు భారత ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. టి20 ప్రపంచకప్ (T20 World cup)లో నిరాశ పరిచిన టీమిండియా.. కివీస్ తో జరిగే సిరీస్ అదరగొట్టాలని పట్టుదలగా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), సీనియర్లు కోహ్లీ (Virat Kohli), రాహుల్ (KL Rahul) లేకుండానే భారత్ ఈ సిరీస్ లో ఆడనుంది. టి20లకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో భారత ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు.
ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లో షాట్స్ ప్రాక్టీస్ చేశారు. నెట్స్ అనంతరం గ్రౌండ్ లో కూడా కాసేపు మనవాళ్లు బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో మిస్టర్ కూల్ సంజూ సామ్సన్ భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. నో లుక్ షాట్లతో తనలోని క్లాస్ ప్లేయర్ ను బయటపెట్టాడు. లెగ్ సైడ్ అతడు ఆడిన షాట్లను ఇతర ప్లేయర్లు నోళ్లు వెల్లబెట్టి మరీ చూశాడు. భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా త్రోలు విసరడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
TICK..TICK..BOOM ???????? All charged up for the #NZvIND T20I series opener#TeamIndia ???????? pic.twitter.com/AsNSTeMqq8
— BCCI (@BCCI) November 17, 2022
హార్దిక్ కు మంచి అవకాశం
ప్రపంచకప్ సాధిస్తాడని ఏరి కోరి తెచ్చుకున్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా టి20 ప్రపంచకప్ లో నిరాశ పరిచాడు. ఈ క్రమంలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండాలంటూ ఒక వాదన మొదలైంది. టి20 ప్రపంచకప్ 2024లో ఉండటంతో దాని గురించి ఇప్పుడే మాట్లాడితే హాస్యాస్పదమే అవుతుంది. అయితే కెప్టెన్ గా నిరూపించుకునేందుకు హార్దిక్ కు ఇది సరైన వేదిక అనే చెప్పాలి. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను ఆడుతున్న తొలి సీజన్ లోనే చాంపియన్ గా నిలిపాడు. ఇక ఐర్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో కూడా కెప్టెన్ గా రాణించాడు.
అయితే ఐపీఎల్ ప్రదర్శనను బట్టి కెప్టెన్ గా 100కు 100 మార్కులు వేయడం మూర్ఖత్వమే అవుతుంది. ఐపీఎల్ లో రాణించి టీమిండియా తరఫున ఫెయిల్ అయిన ప్లేయర్ల జాబితా చాలానే ఉంది. అయితే కెప్టెన్ గా నిరూపించుకునేందుకు హార్దిక్ కు ఇదొక మంచి అవకాశంగా పరిగణించవచ్చు. ఈసారి ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో కాకుండా న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో జరిగే టి20 సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇందులో సక్సెస్ అయితే హార్దిక్ 2024 టి20 ప్రపంచకప్ లో భారత్ ను నడిపించే కెప్టెన్ల రేసులో ఉండే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs newzealand, Kane Williamson, New Zealand, Rishabh Pant, Sanju Samson, Shreyas Iyer, Team India