IND vs NZ 1st T20 : టీమిండియా (Team India)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా రాంఛీలో జరుగుతున్న తొలి టి20లో న్యూజిలాండ్ (New Zealand) బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఆఖరి ఓవర్లలో లయ తప్పిన భారత బౌలింగ్ ను డారిల్ మిచెల్ (30 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చీల్చి చెండాడు. ఈ క్రమంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగుుల చేసింది. ఒక దశలో 150 పరుగులు రావడం కూడా కష్టం అనుకున్న చోట మిచెల్ ఒంటరి పోరాటం చేసి తన జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. డెవోన్ కాన్వే (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు.
టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా.. న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు ఓపెనర్లు కాన్వే, ఫిన్ అలెన్ (23 బంతుల్లో 35 ; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు జట్టుకు శుభారంభం చేశారు. ముఖ్యంగా అలెన్ ఉన్నంతసేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అయితే ప్రమాదకరంగా మారిన ఇతడిని వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ కు చేర్చాడు. మరో మూడు బంతుల తర్వాత కళ్లు చెదిరే క్యాచ్ తో మరో వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ (17) నిరాశ పరిచాడు. ఈ క్రమంలో జట్టు బాధ్యతను కాన్వే, మిచెల్ తీసుకున్నారు. ఆరంభంలో మిచెల్ నెమ్మదిగా ఆడగా.. కుదురుకున్న కాన్వే మాత్రం రెచ్చిపోయాడు. దాంతో కివీస్ బ్యాటింగ్ సాఫీగా సాగిపోయింది. అయితే కాన్వేను అర్ష్ దీప్ అవుట్ చేశాడు. డేంజరస్ బ్యాటర్ బ్రేస్ వెల్ (1) రనౌట్ అయ్యాడు. కాసేపటికే కెప్టెన్ సాంట్నెర్ (7) కూడా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ 155-160 మధ్య ముగుస్తుందని అంతా అనుకున్నారు.
అయితే ఆఖరి ఓవర్లో మిచెల్ విశ్వరూపం ప్రదర్శించాడు. అర్ష్ దీప్ వేసిన తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఇందులో ఒక నో బాల్ ఉంది. మూడో బంతిని ఫోర్ బాదాడు. నాలుగో బంతికి మిచెల పరుగులు చేయలేదు. ఆఖరి రెండు బంతులకు వరుసగా 2, 2 చేశాడు. దాంతో ఆఖరి ఓవర్లో న్యూజిలాండ్ ఏకంగా 27 పరుగలు రాబట్టింది. దాంతో కివీస్ స్కోరు 176కు చేరుకుంది.
తుది జట్లు
టీమిండియా
ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, అర్ష్ దీప్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్
అలెన్ ఫిన్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, చాప్ మన్, డారిల్ మిచెల్, బ్రేస్ వెల్, సాంట్నెర్, ఫెర్గూసన్, డఫీ, సోధి, టిక్నర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Surya Kumar Yadav