హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 1st T20 : వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించినా! ధోని ఇలాకాలో టీమిండియాకు తప్పని ఓటమి

IND vs NZ 1st T20 : వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించినా! ధోని ఇలాకాలో టీమిండియాకు తప్పని ఓటమి

PC : TWITTER

PC : TWITTER

IND vs NZ 1st T20 : ఎట్టకేలకు భారత (India) పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ (New Zealand) ఖాతా తెరిచింది. వన్డే సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని న్యూజిలాండ్.. టి20 సిరీస్ లో మాత్రం శుభాారంభం చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 1st T20 : ఎట్టకేలకు భారత (India) పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ (New Zealand) ఖాతా తెరిచింది. వన్డే సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని న్యూజిలాండ్.. టి20 సిరీస్ లో మాత్రం శుభాారంభం చేసింది. రాంఛీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో టీమిండియా (Team India)పై నెగ్గింది. దాంతో సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులకే పరిమితం అయ్యింది. భారత టాపార్డర్ విఫలం కాగా.. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (28 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ ఆఖర్లో చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో టీమిండియా ఓటమి పక్షాన నిలిచింది.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుబ్ మన్ గిల్ (7), ఇషాన్ కిషన్ (4) విఫలం అయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (34 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్ కు 68 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఆడుతున్న సమయంలో టీమిండియా లక్ష్యం వైపు సాగినట్లు కనిపించింది. అయితే 6 పరుగుల వ్యవధిలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వెనుదిరిగారు. దీపక్ హుడా (10) విఫలం అయ్యాడు. దాంతో భారత్ ఓటమి అంచున నిలిచింది.

వాషింగ్టన్ సుందర్ పోరాటం

అయితే ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. కమ్ బ్యాక్ లో అదరగొడుతున్న సుందర్ ఈ మ్యాచ్ లోనూ మెరుపులు మెరిపించాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో భారత్ ను మళ్లీ విన్నింగ్ రేసులో నిలిపాడు. అయితే కీలక సమయంలో శివమ్ మావి అవుటవ్వడం.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా ఆడకపోవడంతో వాషింగ్టన్ ఒక ఎండ్ లో పోరాటం జరిపినా.. మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో భారత్ ఓడింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగుుల చేసింది. ఒక దశలో 150 పరుగులు రావడం కూడా కష్టం అనుకున్న చోట మిచెల్ ఒంటరి పోరాటం చేసి తన జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. డెవోన్ కాన్వే (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. డారిల్ మిచెల్ (30 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చీల్చి చెండాడు.

First published:

Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Surya Kumar Yadav, Team India

ఉత్తమ కథలు