హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 1st T20 : ఆలస్యంగా ఇండియా వర్సెస్ కివీస్ తొలి టి20.. కారణం ఇదే..

IND vs NZ 1st T20 : ఆలస్యంగా ఇండియా వర్సెస్ కివీస్ తొలి టి20.. కారణం ఇదే..

PC : TWITTER

PC : TWITTER

IND vs NZ 1st T20 : టి20 ప్రపంచకప్ (T20 World cup) ముగిసిన ఐదు రోజులకే టీమిండియా (Team India) సిరీస్ కు సిద్ధమైంది. ఇంగ్లండ్ (England) చేతిలో సెమీఫైనల్లో ఓడిన భారత్ న్యూజిలాండ్ (New Zealand)తో పరిమిత ఓవర్ల సిరీస్ కు సిద్ధమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 1st T20 : టి20 ప్రపంచకప్ (T20 World cup) ముగిసిన ఐదు రోజులకే టీమిండియా (Team India) సిరీస్ కు సిద్ధమైంది. ఇంగ్లండ్ (England) చేతిలో సెమీఫైనల్లో ఓడిన భారత్ న్యూజిలాండ్ (New Zealand)తో పరిమిత ఓవర్ల సిరీస్ కు సిద్ధమైంది. తొలుత మూడు మ్యాచ్ ల టిి20 సిరీస్ జరగనుండగా.. అనంతరం మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి టి20 వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. శుక్రవారం జరగాల్సిన తొలి టి20 వర్షంతో ఆసల్యంగా ఆరంభమయ్యే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వెల్లింగ్టన్ లో వర్షం కురుస్తుంది. శుక్రవారం మొత్తం వెల్లింగ్టన్ లో వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి  : బౌండరీ లైన్ వద్ద ఆసీస్ ఆల్ రౌండ్ అద్భుత విన్యాసం.. ఒంటి చేత్తో ఏకంగా సిక్సర్ ను ఆపేశాడు (వీడియో)

హార్దిక్ కు మంచి అవకాశం

ప్రపంచకప్ సాధిస్తాడని ఏరి కోరి తెచ్చుకున్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా టి20 ప్రపంచకప్ లో నిరాశ పరిచాడు. ఈ క్రమంలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండాలంటూ ఒక వాదన మొదలైంది. టి20 ప్రపంచకప్ 2024లో ఉండటంతో దాని గురించి ఇప్పుడే మాట్లాడితే హాస్యాస్పదమే అవుతుంది. అయితే కెప్టెన్ గా నిరూపించుకునేందుకు హార్దిక్ కు ఇది సరైన వేదిక అనే చెప్పాలి. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను ఆడుతున్న తొలి సీజన్ లోనే చాంపియన్ గా నిలిపాడు. ఇక ఐర్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో కూడా కెప్టెన్ గా రాణించాడు.

అయితే ఐపీఎల్ ప్రదర్శనను బట్టి కెప్టెన్ గా 100కు 100 మార్కులు వేయడం మూర్ఖత్వమే అవుతుంది. ఐపీఎల్ లో రాణించి టీమిండియా తరఫున ఫెయిల్ అయిన ప్లేయర్ల జాబితా చాలానే ఉంది. అయితే కెప్టెన్ గా నిరూపించుకునేందుకు హార్దిక్ కు ఇదొక మంచి అవకాశంగా పరిగణించవచ్చు. ఈసారి ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో కాకుండా న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో జరిగే టి20 సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇందులో సక్సెస్ అయితే హార్దిక్ 2024 టి20 ప్రపంచకప్ లో భారత్ ను నడిపించే కెప్టెన్ల రేసులో ఉండే అవకాశం ఉంది.

First published:

Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Sanju Samson, Team India

ఉత్తమ కథలు