హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 1st ODI : నిప్పులు చెరుగుతున్న ఉమ్రాన్ మాలిక్.. పీకల్లోతు కష్టాల్లో కివీస్

IND vs NZ 1st ODI : నిప్పులు చెరుగుతున్న ఉమ్రాన్ మాలిక్.. పీకల్లోతు కష్టాల్లో కివీస్

PC : BCCI

PC : BCCI

IND vs NZ 1st ODI : భారత్ (India)తో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్లాండ్ వేదికగ జరుగుతున్న తొలి వన్డేలో 307 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 1st ODI : భారత్ (India)తో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్లాండ్ వేదికగ జరుగుతున్న తొలి వన్డేలో 307 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయం సాధించాలంటే 150 బంతుల్లో 192 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లలో అరంగేట్రం హీరో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లతో కివీస్ ను దెబ్బ తీశాడు. కీలకమైన డెవోన్ కాన్వే (24)తో పాటు డారిల్ మిచెల్ (11) వికెట్లను తీశాడు. ఫిన్ అలెన్ (22)ను శార్దుల్ ఠాకూర్ అవుట్ చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ కేన్ విలియమ్సన్ (36 బ్యాటింగ్), టామ్ లాథమ్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ (Shikhar Dhawan), శుబ్ మన్ గిల్ (Shubman Gill), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)లు రెచ్చిపోయారు. దాంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (77 బంతుల్లో 72; 13 ఫోర్లు) క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. శుబ్ మన్ గిల్ (65 బంతుల్లో 50; 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ధావన్ కు సహకరించాడు.  శ్రేయస్ అయ్యర్ (76 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో టీమిండియా భారీ స్కోరును అందుకుంది. ఈ పర్యటనలో తొలి వన్డే ఆడుతున్న సంజూ సామ్సన్ (38 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ధావన్, గిల్ శుభారంభం చేశారు. చాలా రోజుల తర్వాత టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడుతున్న వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తొలుత కుదురుకోవడానికి సమయాన్ని కేటాయించిన వీరు ఆ తర్వాత రెచ్చిపోయారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ తనలోని పాత గబ్బర్ ను బయటకు తెచ్చాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇక మరో ఎండ్ లో ఉన్న గిల్ సిక్సర్ల మోత మోగించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 124 పరుగులు జోడించారు. అయితే ఇదే స్కోరు వద్ద గిల్, ధావన్ పెవిలియన్ కు చేరారు. ఈ దశలో క్రీజులో జతకలిసిన రిషభ్ పంత్ (15), శ్రేయస్ అయ్యర్ జట్టును నడిపించే ప్రయత్నం చేశారు. అయితే పంత్ మరోసారి నిరాశ పరిచాడు. సూర్యకుమార్ యాదవ్ (4)కూడా నిరాశ పరిచాడు. దాంతో 124/0తో పటిష్టంగా ఉన్న భారత్ 24 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సంజూ సామ్సన్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 94 పరుగులు జోడించారు. భారీ షాట్ కు ప్రయత్నించి సామ్సన్ పెవిలియన్ కు చేరాడు.

First published:

Tags: Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Sanju Samson, Shikhar Dhawan, Team India

ఉత్తమ కథలు