హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 1st ODI : తుస్సుమన్న టీమిండియా బౌలింగ్.. లాథమ్ దెబ్బకు వణికిపోయిన పేసర్లు.. ఘోర పరాభవం

IND vs NZ 1st ODI : తుస్సుమన్న టీమిండియా బౌలింగ్.. లాథమ్ దెబ్బకు వణికిపోయిన పేసర్లు.. ఘోర పరాభవం

PC : TWITTER

PC : TWITTER

IND vs NZ 1st ODI : తొలి వన్డేలో టీమిండియా (Team India) బొక్క బోర్లా పడింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ల ో భాగంగా న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 1st ODI : తొలి వన్డేలో టీమిండియా (Team India) బొక్క బోర్లా పడింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ల ో భాగంగా న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 307 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 309 పరుగులు చేసి నెగ్గింది. టామ్ లాథమ్ (104 బంతుల్లో 145 నాటౌట్; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియా బౌలర్లపై శివతాండవం ఆడాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అతడికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ అజేయమైన 4వ వికెట్ కు రికార్డు స్థాయిలో 221 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశాడు.

ఆరంభంలో అదుర్స్.. ఆఖర్లో బెదుర్స్

307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ను ఆరంభంలో భారత బౌలర్లు హడలెత్తించారు. ఫిన్ అలెన్ (22)ను శార్దుల్ ఠాకూర్ అవుట్ చేసి భారత్ కు శుభారంభం చేవాడు. ఈ క్రమంలో బౌలింగ్ కు వచ్చిన అరంగేట్రం హీరో ఉమ్రాన్ మాలిక్  కీలకమైన డెవోన్ కాన్వే (24)తో పాటు డారిల్ మిచెల్ (11)లను అవుట్ చేసి కివీస్ ను దెబ్బ తీశాడు. దాంతో న్యూజిలాండ్ 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఇక్కడి నుంచి భారత్ చేతులెత్తేసింది. క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ లు భారత బౌలర్లను చీల్చి చెండాడారు. మొదట నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన వీరు ఆ తర్వాత దూకుడుగా ఆడారు. ఆరంభంలో ఎక్కువగా కేన్ విలియమ్సన్ పరుగులు రాబట్టాడు. అయితే లాథమ్ సెట్ అయ్యాక సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. బౌలర్ ఎవరైనా సరే లాథమ్ ముందు తేలిపోయారు. ఒక్క వాషింగ్టన్ సుందర్ మాత్రమే 6 లోపు ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిగిలిన ప్లేయర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఆరంభంలో అదరగొట్టిన ఉమ్రాన్ మాలిక్ కూడా చివర్లో తేలిపోయాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్  50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (77 బంతుల్లో 72; 13 ఫోర్లు) క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. శుబ్ మన్ గిల్ (65 బంతుల్లో 50; 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ధావన్ కు సహకరించాడు.  శ్రేయస్ అయ్యర్ (76 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో టీమిండియా భారీ స్కోరును అందుకుంది. ఈ పర్యటనలో తొలి వన్డే ఆడుతున్న సంజూ సామ్సన్ (38 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించాడు.

First published:

Tags: Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Rishabh Pant, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు