హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ 1st ODI : ఇక వన్డే సమరం.. సంజూకు ఛాన్స్ ఇస్తారా? కివీస్ తో తొలి వన్డే.. భారత్ తుది జట్టు ఇదే

IND vs NZ 1st ODI : ఇక వన్డే సమరం.. సంజూకు ఛాన్స్ ఇస్తారా? కివీస్ తో తొలి వన్డే.. భారత్ తుది జట్టు ఇదే

PC : BCCI

PC : BCCI

IND vs NZ 1st ODI : న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ముగిసింది. తొలి టి20 వర్షంతో రద్దవ్వగా.. రెండో టి20లో భారత్ (India) నెగ్గింది. ఇక మూడో టి20 మధ్యలో వర్షం అంతరాయం కలిగించగా.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిన మ్యాచ్ టై అయ్యింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs NZ 1st ODI : న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ముగిసింది. తొలి టి20 వర్షంతో రద్దవ్వగా.. రెండో టి20లో భారత్ (India) నెగ్గింది. ఇక మూడో టి20 మధ్యలో వర్షం అంతరాయం కలిగించగా.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిన మ్యాచ్ టై అయ్యింది. దాంతో టీమిండియా 1-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం భారత్ తన సన్నాహకాలను ఆరంభించనుంది. న్యూజిలాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ నుంచే దీనిని మొదలు పెట్టనుంది. అక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగే తొలి వన్డేలో కివీస్ తో భారత్ సై అంటోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కెప్టెన్ గా శిఖర్ ధావన్

టి20లకు సారథిగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా వన్డేలకు సెలెక్ట్ కాలేదు. అతడితో పాటు ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లు వన్డే జట్టులో చోటు దక్కలేదు. వన్డే సిరీస్ లో భారత జట్టును శిఖర్ ధావన్ నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా ధావన్ తో పాటు శుబ్ మన్ గిల్ లు వచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో కూడా మార్పులు ఉండనున్నాయి. భువీ, హర్షల్ పటేల్ ల స్థానాల్లో శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ లు ఆడే అవకాశం ఉంది. అదే సమయంలో ఉమ్రాన్ మాలిక్ వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక ప్రధాన స్పిన్నర్ గా యుజువేంద్ర చహల్ వ్యవహరించే అవకాశం ఉంది. రెండో స్పిన్నర్ గా దీపక్ హుడా ఆడే అవకాశం ఉంది. దాంతో వాషింగ్టన్ సుందర్ కు నిరాశ తప్పేలా లేదు.

సంజూ సామ్సన్ ఆడతాడా?

సంజూ సామ్సన్ తన చివరి అంతర్జాతీయ సిరీస్ ను సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో ఆడాడు. మూడు మ్యాచ్ ల్లోనూ నాటౌట్ గా నిలిచాడు. అయినప్పటికీ సామ్సన్ కు మళ్లీ ఆడే అవకాశం దక్కడం లేదు. కివీస్ తో ముగిసిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇక అదే సమయంలో వరుసగా విఫలం అవుతున్న రిషభ్ పంత్ కు ఛాన్స్ ల మీద ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. కనీసం వన్డే సిరీస్ లోనైనా సామ్సన్ కు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సంజూకు ఛాన్స్ ఇస్తారా? లేదంటే పంత్ కు మరోసారి అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

వాతావరణం

గురువారం అక్లాండ్ లో వర్షం కురవనుంది. అయితే మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆరంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

టీమిండియా తుది జట్టు అంచనా

శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్/పంత్, దీపక్ హుడా, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, చహల్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Ind vs Nz, Ind vs NZ ODI series, India vs newzealand, Kane Williamson, Rishabh Pant, Sanju Samson, Shikhar Dhawan, Team India

ఉత్తమ కథలు