IND vs NED : ఈ మధ్య కాలంలో ప్రేమికులకు క్రికెట్ మ్యాచ్ లు అడ్డాలుగా మారుతున్నాయి. మ్యాచ్ చూడటానికి వచ్చి మధ్యలో ప్రియురాలికి ఉంగరంతో ప్రపోజ్ చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (Netherlands) మ్యాచ్ మధ్యలో జరిగింది. టి20 ప్రపంచకప్ (T20World Cup) 2022లో భాగంగా సిడ్నీ (Sydney) వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన లవర్స్.. మధ్యలో మూడు ముళ్ల బంధానికి ఓకే చెప్పారు. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 7వ ఓవర్ రెండో బంతి పూర్తయ్యాక.. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అభిమాని తన లవర్ కు ఉంగరం తొడిగి పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రపోజల్ చేశాడు.
ఇది కూడా చదవండి : ఎంత పని చేశావ్ రోహిత్.. పాపం రాహుల్.. ఆగం.. ఆగం.. అయ్యాడు
అంతమందిలో ఊహించని విధంగా తన లవర్ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావడంతో ఆనందానికి ఉబ్బి తబ్బిపోయిన ఆమె.. వెంటనే ఒప్పేసుకుంది. ఇదంతా గ్రౌండ్ లోని భారీ తెరలమీదతో పాటు.. టీవీల్లో కూాడా ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. ప్రస్తుతం ఆ లవర్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.
Lovers...♥️♥️#INDvsNED pic.twitter.com/hf0wJXtDbS
— ShangChi2.O (@Veccna_001) October 27, 2022
One more wicket down #INDvsNED #ICCT20WorldCup2022 pic.twitter.com/KvFmu6eEum
— Divyang Limbachiya ???????? (@gujju_ghogho) October 27, 2022
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కోహ్లీ ( 44 బంతుల్లో 64 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ ( 39 బంతుల్లో 53 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ ( 25 బంతుల్లో 51 పరుగులు నాటౌట్ ; 7 ఫోర్లు, 1 సిక్సర్ ) మెరుపులు మెరిపించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో మెకరీన్, క్లాసెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం తొమ్మిది పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. వాన్ మెకరీన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే, నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయడానికే నానా తంటాలు పడ్డారు. నెదర్లాండ్స్ ఫీల్డర్ల వైఫల్యం వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ బతికిపోయాడు. లేకపోతే.. తక్కువ స్కోరుకే ఔటయ్యేవాడు. నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా పవర్ ప్లేలో కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది అయితే ఇన్నింగ్స్ 10వ ఓవర్ నుంచి రోహిత్ రెచ్చిపోయాడు. భారీ షాట్లతో పరుగులు సాధించాడు. ఈ క్రమంలో రోహిత్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరింతగా రెచ్చిపోయాడు.
సూర్యకుమార్, కోహ్లీ కలిసి స్కోరు బోర్డు వేగం పెంచారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఓ ఔండరీ, సిక్సర్ తో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ. ఆ తర్వాత సూర్య కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, KL Rahul, Netherlands, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli