Home /News /sports /

IND VS IRE 2ND T20I LIVE SCORES HARDIK PANDYA WON THE TOSS AND ELECTED TO BAT FIRST SJN

IND vs IRE 2nd T20 : టాస్ నెగ్గిన హార్దిక్.. జట్టులోకి వచ్చిన స్టార్ ఓపెనర్.. మూడు మార్పులతో భారత్..

PC : BCCI

PC : BCCI

IND vs IRE 2nd T20 : ఐర్లాండ్ (Ireland)తో ఆరంభమయ్యే రెండో టి20లో టాస్ నెగ్గిన టీమిండియా (Team India) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టి20 మాదిరి ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. ఈ పోరు కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది.

ఇంకా చదవండి ...
IND vs IRE 2nd T20 : ఐర్లాండ్ (Ireland)తో ఆరంభమయ్యే రెండో టి20లో టాస్ నెగ్గిన టీమిండియా (Team India) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టి20 మాదిరి ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. ఈ పోరు కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది. గాయపడ్డ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో సంజూ సామ్సన్ కు అవకాశం ఇచ్చింది. అవేశ్ ఖాన్, యుజువేంద్ర చహల్ లకు విశ్రాంతినిచ్చిన టీమిండియా.. వారి స్థానాల్లో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ లకు చోటిచ్చింది. మరో వైపు తొలి టి20లో ఆడిన జట్టునే కొనసాగించేందుకే ఐర్లాండ్ మొగ్గు చూపింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

వర్షం అంతరాయం కలిగించడంతో తొలి టి20 కేవలం 12 ఓవర్ల చొప్పున మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో టీమిండియా పేసర్ ఉమ్రాన్ మాలిక్ కేవలం 1 ఓవర్ మాత్రమే వేశాడు. తన స్పీడ్ ను చూపించలేకపోయాడు. కానీ, ఈ మ్యాచ్ లో అతడు తన పేస్ పవర్ ఏంటో ప్రత్యర్థికి చూపించే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన అర్ష్ దీప్ సింగ్.. టీమిండియా తరఫున అరంగేట్రం చేసేందుకు మరికొంత కాలం ఆగాల్సి ఉంది. భువనేశ్వర్ కుమార్ స్థానంలో అర్ష్ దీప్ కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక సంజూ సామ్సన్ కు మాత్రం మరోసారి అవకాశం దక్కింది. గత మ్యాచ్ లో గాయపడ్డ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో అతడు బరిలోకి  దిగనున్నాడు. ఒక రకంగా సామ్సన్ కు ఇది చివరి అవకాశం అనే చెప్పాలి. ఐపీఎల్ లో కనబర్చిన ఫామ్ ను అతడు ఈ మ్యాచ్ లో చూపిస్తాడో లేదో చూడాలి. ఈ మ్యాచ్ లో సామ్సన్ విఫలం అయితే మాత్రం అతడి అంతర్జాతీయ కెరీర్ సమస్యల్లో పడే అవకాశం ఉంది.



తుది జట్లు:

భారత్: ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్,  ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లక్రాన్ టక్కర్(కీపర్), కర్టిస్ క్యాంపర్, ఆండీ మెక్‌బైన్, జార్జ్ డాక్‌రెల్, మార్క్ అడైర్, బారీ మెకార్తీ, జోషువా లిటిల్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, Rohit sharma, Sanju Samson, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు