Home /News /sports /

IND VS IRE 2ND T20I LIVE SCORES DEEPAK HOODA HITS MAIDEN T20I CENTURY FOR TEAM INDIA AND PUTS MASSIVE TARGET TO IRELAND SJN

IND vs IRE 2nd T20I : ఐర్లాండ్ పై సెంచరీతో కదంతొక్కిన దీపక్ హుడా.. సామ్సన్ సూపర్.. ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

PC : BCCI

PC : BCCI

IND vs IRE 2nd T20I : దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ఐర్లాండ్ (Ireland)తో జరుగుతోన్న రెండో టి20లో భారత్ (India) భారీ స్కోరును అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
IND vs IRE 2nd T20I : దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ఐర్లాండ్ (Ireland)తో జరుగుతోన్న రెండో టి20లో భారత్ (India) భారీ స్కోరును అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. దాంతో అతడి స్థానంలో సంజూ సామ్సన్ (Sanju Samson) బరిలోకి దిగాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ సామ్సన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించాడు. ఫలితంగా భారత్ భారీ స్కోరును అందుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ 3 వికెట్లు తీశాడు. జాష్, క్రెయిగ్ యంగ్ చెరో రెండు వికెట్లు తీశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (3) భారీ షాట్ ఆడే క్రమంలో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేారాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా.. మరోసారి రెచ్చిపోయి ఆడాడు. ఒక ఎండ్ లో ఉన్న సంజూ సామ్సన్ నెమ్మదిగా ఆడినా.. హుడా మాత్రం సిక్సర్లతో రెచ్చిపోయాడు. దాంతో భారత్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. పవర్ ప్లేలో 54 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత మరింత వేగంగా ఆడాడు. మరో ఎండ్ లో ఉన్న సామ్సన్ కూడా తన బ్యాట్ ను ఝుళిపించడంతో టీమిండియా స్కోరు బోర్డు రాకెట్ వేగంతో ముందుకు సాగింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 176 పరుగులు జోడించారు. సామ్సన్ సెంచరీ చేరువగా వచ్చి అవుటవ్వగా.. హుడా మాత్రం తన కెరీర్లో తొలి సెంచరీని అందుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్ గా దీపక్ హుడా ఘనత వహించాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మాత్రమే హుడా కంటే ముందు ఈ ఘనత వహించారు. రోహిత్ శర్మ అత్యధికంగా నాలుగు సెంచరీలు బాదితే.. కేఎల్ రాహుల్ 2 సెంచరీలు చేశాడు. సురేశ్ రైనా ఒక సెంచరీ కొట్టాడు.



తుది జట్లు:

భారత్: ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్,  ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లక్రాన్ టక్కర్(కీపర్), కర్టిస్ క్యాంపర్, ఆండీ మెక్‌బైన్, జార్జ్ డాక్‌రెల్, మార్క్ అడైర్, బారీ మెకార్తీ, జోషువా లిటిల్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, Rohit sharma, Sanju Samson, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు