IND VS IRE 2ND T20 TEAM INDIA BEAT IRLAND BY JUST 4 RUNS AND CLINCHES THE SERIES SJN
IND vs IRE 2nd T20 : భారత్ కు చెమటలు పట్టించిన పసికూన.. దాదాపుగా ఓడించినంత పని చేసిన ఐర్లాండ్..
PC : BCCI
IND vs IRE 2nd T20 : ఉత్కంఠభరిత పోరులో భారత్ (India) గట్టెక్కింది. ఐర్లాండ్ (Ireland) లాంటి పసికూన పై 225 పరుగులు చేసినా.. విజయం కోసం టీమిండియా (Team India) ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది. 226 పరుగుల భారీ లక్ష్యంతో ఐర్లాండ్ బ్యాటింగ్ కు దిగగా.. ఆఖరి ఓవర్లో విజయం సాధించాలంటే 17 పరుగులు కావాల్సిన పరిస్థితిలో నిలిచింది.
IND vs IRE 2nd T20 : ఉత్కంఠభరిత పోరులో భారత్ (India) గట్టెక్కింది. ఐర్లాండ్ (Ireland) లాంటి పసికూన పై 225 పరుగులు చేసినా.. విజయం కోసం టీమిండియా (Team India) ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది. 226 పరుగుల భారీ లక్ష్యంతో ఐర్లాండ్ బ్యాటింగ్ కు దిగగా.. ఆఖరి ఓవర్లో విజయం సాధించాలంటే 17 పరుగులు కావాల్సిన పరిస్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఉమ్రాన్ వేసిన ఆఖరి ఓవర్ తొలి ఐదు బంతుల్లో 9 పరుగులు సాధించింది. చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సిన స్థితిలో కేవలం పరుగు మాత్రమే సాధించి ఐర్లాండ్ జట్టు నాలుగు పరుగుల తేడాతో భారత్ లాంటి పటిష్ట జట్టు చేతిలో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచినా.. ఐర్లాండ్ మనసులను గెల్చుకుంది. ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కెప్టెన్ ఆండీ బాల్బెర్ని (60), పాల్ స్టిర్లింగ్ (40), హ్యారీ టెక్టర్ (39), జార్జ్ డాక్రెల్ (34 నాటౌట్), మార్క్ (23 నాటౌట్) ఐర్లాండ్ విజయం కోసం చివరి వరకు పోరాడారు.
లక్ష్యం 226 పరుగులు.. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ లాంటి బలమైన బౌలింగ్. అయినా ఐర్లాండ్ బెదరలేదు. పాల్ స్టిర్లింగ్, ఆండీ బాల్బెర్ని దంచి కొట్టడంతో ఐర్లాండ్ లక్ష్యం వైపు వేగంగా కదిలింది. దూకుడు మీదున్న స్టిర్లింగ్ ను రవి బిష్ణోయ్ అవుట్ చేసినా ఆ తర్వాత కెప్టెన్ ఆండీ రాణించడంతో ఐర్లాండ్ ఏ దశలోనే వెనుకంజ వేయలేదు. చివర్లో టెక్టర్, డాక్రెల్, మార్క్ కూడా తలా ఓ చెయ్యి వేయడంతో ఐర్లాండ్ లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. ఈ మ్యాచ్ ల ో విజయం సాధించడంతో భారత్ సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. : దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీకి సంజూ సామ్సన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపులు కూడా తోడవ్వడంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ స్కోరును ఉంచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (3) భారీ షాట్ ఆడే క్రమంలో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేారాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా.. మరోసారి రెచ్చిపోయి ఆడాడు. ఒక ఎండ్ లో ఉన్న సంజూ సామ్సన్ నెమ్మదిగా ఆడినా.. హుడా మాత్రం సిక్సర్లతో రెచ్చిపోయాడు. దాంతో భారత్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. పవర్ ప్లేలో 54 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత మరింత వేగంగా ఆడాడు. మరో ఎండ్ లో ఉన్న సామ్సన్ కూడా తన బ్యాట్ ను ఝుళిపించడంతో టీమిండియా స్కోరు బోర్డు రాకెట్ వేగంతో ముందుకు సాగింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 176 పరుగులు జోడించారు. సామ్సన్ సెంచరీ చేరువగా వచ్చి అవుటవ్వగా.. హుడా మాత్రం తన కెరీర్లో తొలి సెంచరీని అందుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్ గా దీపక్ హుడా ఘనత వహించాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మాత్రమే హుడా కంటే ముందు ఈ ఘనత వహించారు. రోహిత్ శర్మ అత్యధికంగా నాలుగు సెంచరీలు బాదితే.. కేఎల్ రాహుల్ 2 సెంచరీలు చేశాడు. సురేశ్ రైనా ఒక సెంచరీ కొట్టాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.