news18-telugu
Updated: June 29, 2019, 2:47 PM IST
భారత్, పాక్ అభిమానులు
‘భారత్ గెలవాలి.. టీమిండియా విజయం సాధించాలి.’ ఇలా అంటోంది భారతీయులే కాదు. పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా. జూన్ 30న ఇంగ్లండ్‌తో టీమిండియా మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఎవరికి మద్దతు తెలుపుతారంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నజీర్ హుస్సేన్ ట్విట్టర్లో పాకిస్తాన్ ఫ్యాన్స్ ని ప్రశ్నించాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. వారిలో 90 శాతానికి పైగా ఫ్యాన్స్ భారత్‌కు మద్దతు పలికారు. వారిలో చాలా మంది ‘పొరుగుదేశానికి మా మద్దతు’ అంటే.. మరికొందరు ‘ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా భారత్, పాక్ ఎప్పుడూ ఏకం అవుతాయి’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇంకొందరు ఏకంగా ఆరెంజ్ జెర్సీ కొనుక్కుని తాము ఆ రోజు మ్యాచ్‌ను ఆస్వాదిస్తామని చెబుతున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. భారత్ , ఇంగ్లండ్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే కోహ్లీ సేన సెమీఫైనల్‌కు వెళ్తుంది. పాకిస్తాన్‌కు సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
June 29, 2019, 2:42 PM IST