టామ్‌ కరన్‌తో, కృనాల్‌ పాండ్యా గొడువ.. వైరల్ మారిన వీడియో!

Krunal Pandya Engage In War Of Words With Tom Curran

కృనాల్‌ గొడవకు దిగాడు. 49వ ఓవర్‌లో కృనాల్‌.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ టామ్‌ కరన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసే క్రమంలో ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు దూషించుకుంటున్నారు.

 • Share this:


  ఫుణే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కృనాల్‌ పాండ్యా ఆరంభంలోనే ఆదరగొట్టాడు. మొదటి మ్యాచ్‌లోనే పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. దాటిగా బ్యాటింగ్ చేసి 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. తొలి మ్యాచ్ అత్యంత వేగంగా ఫీప్ట్ చేసిన క్రికెటర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. అరంగేట్రం చేసిన తొలి వన్డేలోనే అర్ధ శతకం సాధించిన టీమిండియా 15వ బ్యాట్స్‌మెన్‌గా, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 50 పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.  ఇక ఈ మ్యాచ్‌లో కృనాల్‌ గొడవకు దిగాడు. 49వ ఓవర్‌లో కృనాల్‌.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ టామ్‌ కరన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసే క్రమంలో ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు దూషించుకుంటున్నారు. తర్వాత అంపైర్‌ జోక్యం చేసుకుని గొడవను ఆపాడు. కృనాల్ మాత్రం వెనక్కి తగ్గకుండా తిరిగి టామ్‌ కరన్‌ వైపు దూసుకురాబోయాడు. తర్వాత టామ్‌ తన స్థానంలోకి వెళ్లడంతో వివాదం ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 318 పరుగుల లక్ష్య చేధనలో మోర్గాన్ సేన చతికిలపడింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 317 పరుగులు సాధించింది. ఓపెనర్ ధావన్ మాత్రం సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగాడు 106 బంతుల్లో 2 సిక్స్‌లు, 11 ఫోర్లతో 98 పరుగులు చేసి జట్టు స్కోర్‌లో కీలక పాత్ర పోషించాడు.

  318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరంభంలో అదరగొట్టింది. రాయ్, బెయిర్‌స్టో సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి మొదటి వికెట్ కోల్పోయే సమయానికి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత ఇంగ్లాండ్ క్రమంగా వికెట్లు కోల్పోవడంతో 318 పరుగుల లక్ష్య చేధనలో మోర్గాన్ సేన చతికిలపడింది.
  Published by:Rekulapally Saichand
  First published: