లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో (India Vs England) భారత జట్టు (Team India) ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై (England) ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 215/2 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఒక్క సెషన్‌లోనే మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు కేవలం 19.3 ఓవర్ల పాటు మాత్రమే బ్యాటింగ్ చేసి మిగిలిన 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. భారత జట్టు నాలుగో రోజు 63 పరుగులు మాత్రమే జత చేసింది. కోహ్లీ (Virat Kohli) నుంచి సిరాజ్ (Mohammed Siraj) వరకు కేవలం 54 నిమిషాల్లో పెవీలియన్ చేరిపోయారంటే భారత జట్టు ఎంత దారుణంగా బ్యాటింగ్ చేసిందో అర్దం చేసుకోవచ్చు. నిన్న చివరి సెషన్ తప్ప భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఏ సెషన్ లోనూ ఆధిపత్యం కనపర్చలేక పోయింది. లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. కీలకమైన నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఓవల్ వేదికగా జరగనుంది. అయితే, మూడో టెస్ట్ ఓటమి సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడో టెస్టులో స్కోరు బోర్డుపై ఉన్న భారీ పరుగులే టీమిండియాను ఒత్తిడికి గురిచేశాయని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇంగ్లండ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరైనా కుప్పకూలడం సాధారణ విషయమని, గతంలోనూ ఇలాంటి వైఫల్యాల నుంచి మెరుగైన ప్రదర్శన చేశామని గుర్తు చేసుకున్నాడు.
ఇక మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి నాలుగో టెస్ట్ లో టీమిండియాలో సమూల మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చాడు. ఇక రెండో స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం అనేది పిచ్‌పై ఆధారపడి ఉంటుందని, దాని గురించి తర్వాత ఆలోచిస్తామని భారత సారథి విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తమ తప్పులు తెలుసుకొని ముందుకు సాగుతామని, గతంలోనూ ఇలాంటి వైఫల్యాల నుంచి మెరుగైన ప్రదర్శన చేశామని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. ఇక మేము రొటేషన్ పాలసీ గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చిందని, జట్టులో మార్పులు చేయాల్సి ఉంటుందన్నాడు. సుదీర్ఘ పర్యటనలో ప్రతి ఒక్కరూ 4 టెస్టు మ్యాచ్‌లు ఆడతారని తాము ఊహించలేదని కోహ్లీ స్పష్టం చేశాడు.
జట్టులో ప్రధాన స్పిన్నర్ లేకపోవడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది.రవీంద్ర జడేజాలాగే రవిచంద్రన్ అశ్విన్ కూడా బ్యాటుతో రాణించగలడు. అతనికి టెస్టుల్లో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. అన్నింటికీ ముఖ్యంగా అశ్విన్‌కి జో రూట్‌పై మంచి రికార్డు ఉంది. అలాంటి మ్యాచ్ విన్నర్‌ను పక్కనబెట్టడం చాలా పెద్ద వ్యూహాత్మిక తప్పిదం. దీంతో నాలుగో టెస్ట్ లో అశ్విన్ ను కచ్చితంగా తుది జట్టులో చూడొచ్చు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్, పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్ లకు జట్టులో చోటు దక్కే ఛాన్సులు ఉన్నాయని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Ravichandran Ashwin, Team India, Virat kohli