Ind Vs Eng : పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. మరోసారి ఆ ముగ్గురు ఫెయిల్.. స్కోరు వివరాలు ఇలా..

Ind Vs Eng

Ind Vs Eng : ఇంగ్లండ్‌ (England)తో బుధవారం ప్రారంభ‌మైన మూడో టెస్ట్ తొలి రోజు తొలి సెష‌న్‌లోనే టీమిండియా (Team India) పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు... మొదటి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది.

 • Share this:
  ఇంగ్లండ్‌ (England)తో బుధవారం ప్రారంభ‌మైన మూడో టెస్ట్ తొలి రోజు తొలి సెష‌న్‌లోనే టీమిండియా (Team India) పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు... మొదటి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)కి, టీమిండియాకి ఈ ఫలితం ఏ మాత్రం సంతోషాన్ని ఇవ్వదు. ఇంగ్లండ్ పేస్ బౌల‌ర్ జేమ్స్ అండర్సన్‌ (James Anderson) చెల‌రేగ‌డంతో 21 ప‌రుగుల‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (KL Rahul) (0), టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ చేతేశ్వర్ పుజారా (Cheteswara Pujara) (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (7) దారుణంగా విఫ‌ల‌మయ్యారు. ఈ మూడు వికెట్లూ అండర్సన్‌ ఖాతాలోకే వెళ్లాయి.జిమ్మీ ఆరు ఓవ‌ర్ల‌లో ఆరు ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ముగ్గురు కీపర్‌ జోష్ బట్లర్‌ (Jos Buttler)కి క్యాచ్‌ ఇవ్వడం ఇక్కడ విశేషం. రోహిత్ శర్మ, అజింక్య రహానేలు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ కుదురుకునే ప్రయత్నం చేశారనుకునే లోపు జింక్స్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్ లో ఔటై పెవిలియన్ బాట పట్టాడు. అజింక్య రహానే కూడా బట్లర్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం విశేషం. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)మాత్రం ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 75 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 15 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. తొలి సెషన్‌లో దాదాపు సగం బంతులను రోహిత్ శర్మ ఎదుర్కోవడం విశేషం.

  టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. జేమ్స్ అండ‌ర్స‌న్ వేసిన మ్యాచ్ తొలి ఓవ‌ర్‌లోనే.. కీప‌ర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి లోకేష్ రాహుల్ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ ఐదవ బంతిని అతడు డ్రైవ్‌ చేయబోయాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి కీపర్‌ బట్లర్‌ చేతుల్లో పడింది. అండర్సన్‌ వేసిన 4.1వ బంతికి ఛతేశ్వర్ పుజారా (1; 9 బంతుల్లో) బలయ్యాడు.అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10.5 ఓవర్‌కు విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. కోహ్లీ కీపర్‌ బట్లర్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో అండర్సన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. సరిగ్గా చెప్పాలంటే కోహ్లీ సెంచరీ చేసి దాదాపు 630 రోజులు అయింది. ఈరోజు 7 పరుగులకే ఔట్ అవ్వడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

  ఇది కూడా చదవండి :  లార్డ్స్ డైనింగ్ రూమ్ లో రాజకీయ నాయకుల్లా రెచ్చిపోయిన కోహ్లీ, జో రూట్.. బూతులు తిట్టుకుంటూ..

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్​లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్​లో బంగ్లాదేశ్​పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల ముగిసిన టెస్ట్​ ఛాంపియన్​షిఫ్​ ఫైనల్​లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్​లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను వమ్ము చేస్తూనే ఉన్నాడు.

  India (Playing XI): రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

  England (Playing XI): రోరి బర్న్స్ , హాసీబ్ హామీద్, డేవిడ్ మలన్, జో రూట్(c), జానీ బెయిర్ స్టో, జాస్ బట్లర్(w), మొయిన్ అలీ , సామ్ కర్రన్, క్రెగ్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్
  Published by:Sridhar Reddy
  First published: