IND VS ENG TEST MATCH ENGLAND WICKET KEEPER BATTER BEN FOAKES TESTED POSITIVE FOR COVID 19 SJN
England Team : రీ షెడ్యూల్ టెస్టుపై కరోనా పంజా.. పాజిటివ్ గా తేలిన ఇంగ్లండ్ వికెట్ కీపర్
PC : ECB
England Team : భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జూలై 1 నుంచి ఆరంభమయ్యే రీ షెడ్యూల్ టెస్టుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తొలుత టీమిండియా (Team India) సారథి కరోనా బారిన పడగా.. తాజాగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (Ben Foakes) కూడా ఈ మహమ్మారి బారిన పడ్డాడు.
England Team : భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జూలై 1 నుంచి ఆరంభమయ్యే రీ షెడ్యూల్ టెస్టుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తొలుత టీమిండియా (Team India) సారథి కరోనా బారిన పడగా.. తాజాగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (Ben Foakes) కూడా ఈ మహమ్మారి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో ఫోక్స్ న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతోన్న మూడో టెస్టు నుంచి మధ్యలోనే వైదొలిగాడు. కరోనా లక్షణాలు ఉండటంతో పాటు ఫోక్స్ నడుం నొప్పితో బాధపడ్డాడు. దాంతో మూడో రోజు ఆటకు దూరంగా ఉన్నాడు. అనంతరం అతడికి కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలాడు. భారత్ తో జరిగే టెస్టు మ్యాచ్ కోసం ప్రకటించిన జట్టులో ఫోక్స్ కూడా ఉన్నాడు.
కివీస్ తో జరిగే టెస్టు నుంచి ఫోక్స్ మధ్యలోనే తప్పుకోవడంతో అతడి స్థానంలో స్యామ్ బిల్లింగ్స్ ను ఎంపిక చేస్తున్నట్లు ఈసీబీ తెలిపింది. టీమిండియాతో మ్యాచ్ నాటికి ఫోక్స్ కోలుకోకపోతే అతడి స్థానంలో బిల్లింగ్స్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫోక్స్ ఐసోలేషన్ లో ఉన్నట్లు.. భారత్ తో టెస్టు మ్యాచ్ నాటికి అతడు కోలుకునే అవకాశం ఉన్నట్లు ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక మరోవైపు భారత స్టార్ ప్లేయర్ రోహిత్ కూడా కరోనా బారిన పడటం తెలిసిందే. ప్రస్తుతం యూకేలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఇంగ్లండ్ పర్యటనను సవ్యంగా పూర్తి చేయగలుగుతుందో లేదో అని భారత అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈసీబీ మాత్రం భారత పర్యటనను సక్సెస్ చేసేందుకు మేం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొంది.
అరగంట ముందుగా టెస్టు మ్యాచ్
వాస్తవానికి భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నుంచి ఆరంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆరంభమై రాత్రి 11 గంటల వరకు జరుగుతున్నాయి. అయితే భారత్ తో జరిగే మ్యాచ్ ను మాత్రం అరగంట ముందుగా ఆరంభమయ్యేలా ఈసీబీ నిర్ణయం తీసుకుంది. దాంతో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. ఈ టెస్టు మ్యాచ్ అనంతరం జూలై 7, 9, 10వ తేదీల్లో మూడు టి20లను.. 12, 14, 17వ తేదీల్లో మూడు వన్డేలను భారత్ ఆడుతుంది. అనంతంర వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరుతుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.