హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Eng : విరాట్ కోహ్లీ తనకున్న ఈగో వల్లే అశ్విన్ ను పక్కన పెడుతున్నాడా..!

Ind Vs Eng : విరాట్ కోహ్లీ తనకున్న ఈగో వల్లే అశ్విన్ ను పక్కన పెడుతున్నాడా..!

Virat Kohli - Ashwin

Virat Kohli - Ashwin

Ind Vs Eng : వరల్డ్ నెం. 2 బౌలర్ అయిన అశ్విన్ ను జట్టులోకి తీసుకోకపోవడం నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది. జడేజాతో పోలీస్తే.. అశ్విన్ కు ఇంగ్లండ్ పై బెటర్ రికార్డు ఉంది. అంతేగాక, కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.

ఫస్ట్ టెస్ట్‌లో విజయాన్ని తృటిలో చేజార్చుకొని.. రెండో టెస్ట్‌లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఇంగ్లండ్ (England) గడ్డపై జోరు కనబర్చిన కోహ్లీ సేన (Team India Updates).. మూడో మ్యాచ్ లో చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్ల ఔట్‌ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌‌కు చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్ దారుణ ఓటమికి కారణమయ్యారు. ఇక, కెన్నింగ్టన్ ఓవల్‌ మైదానంలో భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం అయింది. ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్‌ జో రూట్‌ (Joe Root) తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ జ‌ట్టు రెండు మార్పులు చేసింది. జోస్ బ‌ట్ల‌ర్‌, సామ్ కరన్ స్థానంలో ఒలీ పోప్‌, క్రిస్ వోక్స్ వ‌చ్చారు. మరోవైపు భార‌త జ‌ట్టులో కూడా రెండు మార్పులు జ‌రిగాయి. సీనియర్ పేసర్లు ఇషాంత్ శ‌ర్మ‌, మొహ్మద్ ష‌మీ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్‌, ఉమేశ్ యాద‌వ్‌లు జ‌ట్టులోకి వచ్చారు. దీంతో సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ విచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin)కు మరోసారి నిరాశే ఎదురైంది. నిజానికి నాలుగో టెస్టుకు ముందు రవీంద్ర జడేజా(Ravindra Jadeja) గాయంతో ఆసుపత్రిలో చేరడంతో రవిచంద్రన్‌ అశ్విన్ ఓవల్‌ టెస్ట్ ఆడడం ఖాయం అనుకున్నారు. మరోవైపు కెన్సింగ్టన్‌ ఓవల్‌ మైదానం మాములుగా పేస్‌తో పాటుగా స్పిన్‌కు సహకరిస్తుంది. మ్యాచ్ సాగేకొద్ది స్పిన్నర్లు పండగ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దీంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli Updates).. స్పెసలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవకాశం ఇస్తాడని అందరూ భావించారు. కానీ కోహ్లీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. ఫిట్‌నెస్‌ సాధించిన జడేజానే కొనసాగించాడు. ఇషాంత్ శ‌ర్మ‌ స్థానంలో కూడా అశ్విన్‌కు చోటివ్వకుండా.. శార్దూల్ ఠాకూర్‌ను ఎంచుకున్నాడు.

టాస్ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ రవిచంద్రన్‌ అశ్విన్ ఎంపికపై స్పందించాడు. ఇంగ్లండ్‌ జట్టులో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు కాబట్టి రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నాం. అతడు వారిని నిలువరించగలడు. జడ్డు ఏడో స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి జట్టు సమతూకంగా మారుతుంది. బ్యాటింగ్ స్ట్రాంగ్ గా మారుతోంది' అని కోహ్లీ వివరించాడు.

మరోవైపు నాలుగు టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌కు జట్టులో ప్లేస్ దక్కకపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత ఫాన్స్ మండిపడుతున్నారు. ఒకవైపు ట్వీట్ల వర్షం కురిపిస్తూ.. మరోవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

" ఎప్పటికైనా ఇది చెత్త ఎంపిక. విరాట్ కోహ్లీకి అంత అహం ఎందుకు.. ఆర్ అశ్విన్‌నే ఆడించడా?'" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. " అశ్విన్ లేడుగా.. ఈ మ్యాచ్ కూడా పోయినట్టే" అని ఇంకొకరు ట్వీట్ చేశారు. " యాష్ లేడా.. జట్టు ఎంపికపై ఆశ్చర్యం వేస్తోంది" అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అశ్విన్ ఈ సిరీసులో ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే.

అశ్విన్ తుది జట్టులో లేకపోవడంపై కామెంటేటర్లు హర్ష భోగ్లే, సంజయ్ మంజ్రేకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అశ్విన్ ఎంపిక గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. యాష్ నెట్స్‌లో తెల్లటి బంతితో బౌలింగ్ చేస్తే ఆశ్చర్యపోతా అని భోగ్లే ట్వీట్ చేశాడు.

వరల్డ్ నెం. 2 బౌలర్ అయిన అశ్విన్ ను జట్టులోకి తీసుకోకపోవడం నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది. జడేజాతో పోలీస్తే.. అశ్విన్ కు ఇంగ్లండ్ పై బెటర్ రికార్డు ఉంది. అంతేగాక, కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అలాంటి, అశ్విన్ పక్కన పెట్టడం భారత క్రికెట్ ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు.

ఇది కూడా చదవండి : ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ వ్యూహం.. కోహ్లీసేనకు కలిసొస్తుందా?

తుది జట్లు

టీమిండియా : కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానే, రిషబ్ పంత్‌, రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌.

ఇంగ్లండ్‌: రోరీ బర్న్స్‌, హసీద్ హమీద్‌, డేవిడ్ మలన్‌, జో రూట్‌ (కెప్టెన్‌), ఓలి పోప్‌, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్‌, క్రెయిగ్ ఓవర్టన్‌, ఓలి రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌.

First published:

Tags: Cricket, IND VS ENG, India vs england, Ravichandran Ashwin, Ravindra Jadeja, Sports, Virat kohli

ఉత్తమ కథలు