Home /News /sports /

IND VS ENG TEAM INDIA WICKET KEEPER RISHABH PANT COMMENTS ON UMPIRE GOES VIRAL SRD

Rishabh Pant : " అంపైర్ మాట వినడం వల్లే ఔట్ అయ్యాను " .. రిషబ్ పంత్ సంచలన కామెంట్స్..

Risabh Pant

Risabh Pant

Rishabh Pant : రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ కొనసాగుతోంది. దాదాపు ఈ మ్యాచ్ పై టీమిండియా పట్టు కోల్పోయింది.

    రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ కొనసాగుతోంది. దాదాపు ఈ మ్యాచ్ పై టీమిండియా పట్టు కోల్పోయింది. ఐదు టెస్ట్ ల ఇంగ్లాండ్ (England) పర్యటనలో తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా వెనుకబడి, లార్డ్స్‌లో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచిన టీమిండియా (Team India).. అదే జోరులో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూసింది. కానీ లీడ్స్ టెస్టులో భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. దీంతో భారత్ దాదాపు రేసులో వెనకపడినట్టే. అయితే, ఫస్ట్ టెస్ట్ లో అంపైర్ మాట వినడం వల్లే ఔట్ అయ్యాను అంటూ యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) సంచలన వ్యాఖ్యలు చేశాడు. లీడ్స్ టెస్టులో 9 బంతులు ఆడిన రిషబ్ పంత్, 2 పరుగులు మాత్రమే చేసి ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ ఫెయిల్ అవ్వడం కూడా టీమిండియా స్వల్ప స్కోరుకే ఆలౌట్ కావడం కారణమైంది. రిషబ్ పంత్ అవుట్ అయ్యే సమయానికి 58/5 పరుగుల వద్ద ఉన్న టీమిండియా, ఆ తర్వాత 67 పరుగుల వద్ద నాలుగు వరుస వికెట్లు కోల్పోయి 67/9 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆఖరి వికెట్‌కి 11 పరుగుల భాగస్వామ్యం రావడంతో 78 పరుగులకి ఆలౌట్ అయ్యింది. స్వదేశంలో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన రిషబ్ పంత్, ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో భారత జట్టు తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 25 పరుగులు చేసిన రిషబ్ పంత్, లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు

    మొదటి ఇన్నింగ్స్‌ తర్వాత మీడియాతో మాట్లాడిన పంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయ్. " నేను క్రీజుకి కొద్దిగా బయట నిలబడి బ్యాటింగ్ చేయాలని అనుకున్నా...అయితే నేను అలా నిలబడినప్పుడు నా ముందు కాలు, డేంజర్ ఏరియాలో ఉందని చెప్పిన అంపైర్, నన్ను అక్కడ నిల్చోకూడదని చెప్పాడు. ఓ రకంగా బలవంతంగా నా బ్యాటింగ్ పొజిషన్‌ మార్చాడు...అంపైర్ చెప్పడంతో నేను ఏమీ ఆలోచించకుండా బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చుకున్నాను. ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యా. అయితే ప్రతీ బ్యాట్స్‌మెన్‌కి క్రీజు నుంచి ముందుకొచ్చి బ్యాటింగ్ చేసే సదుపాయం ఉంటుంది. అందులో ఎలాంటి తప్పూ లేదు " అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్.

    ఇది కూడా చదవండి :  గేదెపై పిల్లగాడి స్నానం.. ఆ కిక్కే వేరప్పా అంటున్న సెహ్వాగ్ .. బుడ్డోడి ఫీట్స్ అదుర్స్..

    " ప్రతీ క్రికెటర్‌కి రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఒకటి జట్టుకోసం ఆలోచించి, అవసరమైన చోట బ్యాటింగ్ చేయడం. మరోటి వ్యక్తిగత ప్రదర్శనకు విలువ నిచ్చి, అనువైన పొజిషన్‌లో బ్యాటింగ్ చేయడం... నేనెప్పుడూ మొదటి దానినే ఎంచుకుంటాను. జట్టులో ఉన్నప్పుడు, టీమ్‌కి ఏది అవసరమో దాన్ని చేయడానికి ప్రతీ ప్లేయర్ సిద్ధంగా ఉండాలి. జట్టు పర్ఫామెన్స్ కంటే వ్యక్తిగత పర్ఫామెన్స్‌ ముఖ్యమేమీ కాదు. వ్యక్తిగత విషయాలు ముఖ్యమే కానీ భారత జట్టులో మాకందరికీ టీమే ముఖ్యం." అంటూ కామెంట్ చేశాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. మొత్తానికి ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ ప్రదర్శన టీమిండియాపై ప్రభావం చూపుతోంది. రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మరోవైపు, ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IND VS ENG, India vs england, Rishabh Pant, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు