IND VS ENG TEAM INDIA STAR OPENER ROHIT SHARMA SELIFE PIC WITH HIS WIFE RITIKA GOES VIRAL IN SOCIAL MEDIA SRD
Rohit Sharma On His Wife : " ప్రస్తుత పరిస్థితుల్లో మనం ప్రేమించే వారు పక్కన ఉంటే ఆ కిక్కే వేరప్పా" ..
Rohit-Ritika (Photo : Instagram)
Rohit Sharma On His Wife : ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. ఈ విక్టరీ తర్వాత టీమిండియా ఆటగాళ్లు, ఫ్యాన్స్ మైమర్చిపోయారు. సంబరాల్లో మునిగి తేలారు. ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఆటగాళ్లంతా ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. మూడో టెస్ట్ మొదలవ్వడానికి ఇంకా సమయం ఉండటంతో తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో భారత జట్టు (Team India) చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అసలు చివరి రోజు టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. మహా అయితే డ్రా చేయడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నారు. కానీ కోహ్లీ సేన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టును ఒక ఆట ఆడుకుంది. ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. ఈ విక్టరీ తర్వాత టీమిండియా ఆటగాళ్లు, ఫ్యాన్స్ మైమర్చిపోయారు. సంబరాల్లో మునిగి తేలారు. ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఆటగాళ్లంతా ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. మూడో టెస్ట్ మొదలవ్వడానికి ఇంకా సమయం ఉండటంతో తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఇక, టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా.. తన భార్య రితికాతో సరదాగా గడుపుతున్నాడు. ఈ జంట కలిసి డిన్నర్ చేస్తోన్న ఫోటోని హిట్ మ్యాన్ లేటెస్ట్ గా షేర్ చేశాడు. రితికాతో కలిసి ఉన్న సెల్ఫీ ఫోటోని షేర్ చేసిన హిట్ మ్యాన్ దానికి ఎమోషనల్ మెసేజ్ ను క్యాప్షన్ గా ఇచ్చాడు.
"ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు.. మనల్ని.. మనం ప్రేమించిన వారికి గట్టిగా పట్టుకునేలా చేస్తున్నాయి." అంటూ క్యాప్షన్ తో పాటు భార్య రితికాతో ఉన్న ఫోటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు రోహిత్ శర్మ. కాగా.. ఈ ఫోటో రోహిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోకి లక్షల్లో లైకుల వర్షం కురవగా.. వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. ఇక... లార్డ్స్ లో రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో 1-0 తో భారత్ ఆధిక్యం సాధించింది. మూడో టెస్ట్ లీడ్స్ వేదికగా ఈ నెల 25( బుధవారం నుంచి) ప్రారంభం కానుంది. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రోహిత్.. కేఎల్ రాహుల్ తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ ఓపెనర్లుగా.. బరిలోకి దిగగా.. ఇద్దరూ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ 83 పరుగులు చేయగా.. రాహుల్ తో కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఇక మరోవైపు, రోహిత్ శర్మ ఫీల్డింగ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మహమ్మద్ సిరాజ్ వేసిన 52 ఓవర్లో రెండో బంతికి బట్లర్ ఔటవ్వగా.. ఐదో బంతికి జేమ్స్ అండర్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో వేసిన ఆ బంతిని అండర్సన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్‌ను ముద్దాడుతూ వికెట్ స్టంప్స్‌ను లేపేసింది.అయితే స్టంప్స్ తాకిన బంతి నేరుగా స్లిప్‌లో ఉన్న రోహిత్ వైపు దూసుకెళ్లింది. దీంతో ఆ బంతిని రోహిత్ ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు. ఈ వికెట్‌తో భారత విజయం లాంఛనమవడంతో ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగి తేలారు. అయితే, రోహిత్ క్యాచ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. టీవీ రీప్లేలో కూడా రోహిత్ క్యాచ్ పట్టిన విషయం కనబడలేదు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఎవరూ గుర్తించని రోహిత్ శర్మ సూపర్ క్యాచ్ అంటూ క్యాప్షన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. నిజంగా అద్భుతమైన క్యాచని, విజయానందరంలో గుర్తించలేకపోయామని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.