నేడు భారత్, ఇంగ్లండ్‌ నాలుగో టెస్టు... టీమిండియా ఒక మార్పే!

India vs England (Photo Credit : Twitter)

దాదాపు మూడో టెస్ట్ ఆడిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. జట్టులో స్పల్ప మార్పు కనిపించనుంది. విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ తుది జట్టులోకి రావచ్చు

 • Share this:
  నాలుగు టెస్ట్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటివరకు 2-1తో లీడ్‌లో ఉన్న టీమిండియా ఇక ఆఖరిది కూడా గెలిచి సిరీస్ పూర్తి అధిపత్యాన్ని చలాయించాలని చూస్తోంది. ఇక ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు కూడా మొదటి మ్యాచ్‌ తరహాలో అసాధారణ ప్రదర్శనతో సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. మూడో టెస్ట్ గెలుపుతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) రేసులో భారత్ నిలవగా ఓటమితో ఇంగ్లాండ్ ఆ రేసు నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధిస్తే ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.ఆఖరి పోరుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే నాలుగో టెస్టుకు భారత్, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి.

  జట్టులో మార్పులు

  దాదాపు మూడో టెస్ట్ ఆడిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. జట్టులో స్పల్ప మార్పు కనిపించనుంది. విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ తుది జట్టులోకి రావచ్చు. సిరాజ్‌ ఉన్నప్పటికి భారత గడ్డపై ఉమేశ్‌కు ఉన్న రికార్డు కారణంగా అతనికి ప్రాధాన్యత లభించనుంది. ఇక గత మ్యాచ్ హీరోలు అశ్విన్, అక్షర్‌ పటేల్‌ ఎలా రాణిస్తారు అనేది ఆసక్తికరం. బౌలింగ్‌లో లోపాలు కనిపించనప్పటికి బ్యాటింగ్ మాత్రం టీమిండియా కాస్త తడబడుతుంది. బౌల్‌తో రాణించకపోయిక బ్యాట్‌తో రాణిస్తున్న వాషింగ్టన్‌ సుందర్‌కు మరో అవకాశం ఖాయమైంది. అయితే స్పిన్నర్ల జోరుకు రెండు వరుస విజయాలు దక్కడంతో మన బ్యాటింగ్‌ వైఫల్యాన్ని ఎవరూ పట్టించుకోలేదనేది వాస్తవం. సిరీస్‌ మెుత్తం రోహిత్‌ శర్మ (296) అత్యిధిక పరుగులు చేశాడు. ఆ త్వరాత సీనియర్ స్పీన్నర్ అశ్విన్‌ (176) ఉండడం బ్యాటర్స్ ఎంతగా వైఫల్యం చెందుతున్నారో అర్థమవుతుంది. సారథి కోహ్లి సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలు చేసినప్పటికి అవి పెద్ద ఉపయోగపడలేదు. ఓపెనర్ గిల్‌తో పాటు రహానే, పుజారా అశించిన స్థాయిలో రాణించడం లేదు. కావున టీమిండియా బ్యాటింగ్ ఆంశంపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవపరం ఉంది.

  తుది జట్లు (అంచనా)
  భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, గిల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, సుందర్, అక్షర్, ఉమేశ్, ఇషాంత్‌ శర్మ.

  ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), క్రాలీ, సిబ్లీ, బెయిర్‌స్టో, స్టోక్స్, పోప్, ఫోక్స్, బెస్, ఆర్చర్‌/స్టోన్, లీచ్, అండర్సన్‌
  Published by:Rekulapally Saichand
  First published: