Home /News /sports /

IND VS ENG TEAM INDIA FANS DEMANDS RAVI CHANDRAN ASHWIN AND SHARDUL THAKUR IN FOURTH TEST PLAYING XI SRD

Ind Vs Eng : నాలుగో టెస్ట్ కి ఈ మార్పులు చేయాల్సిందే...! జో రూట్ కి చెక్ పెట్టాలంటే అతడు రావాల్సిందే..!

Ind Vs Eng

Ind Vs Eng

Ind Vs Eng : లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. కీలకమైన నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఓవల్ వేదికగా జరుగనుంది. అయితే, ఇంగ్లాండ్‌ టూర్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో టీమిండియా అద్భుతమైన ఆటతీరు చూపించింది.

ఇంకా చదవండి ...
  లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో (India Vs England) భారత జట్టు (Team India) ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై (England) ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 215/2 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఒక్క సెషన్‌లోనే మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు కేవలం 19.3 ఓవర్ల పాటు మాత్రమే బ్యాటింగ్ చేసి మిగిలిన 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. భారత జట్టు నాలుగో రోజు 63 పరుగులు మాత్రమే జత చేసింది. కోహ్లీ (Virat Kohli) నుంచి సిరాజ్ (Mohammed Siraj) వరకు కేవలం 54 నిమిషాల్లో పెవీలియన్ చేరిపోయారంటే భారత జట్టు ఎంత దారుణంగా బ్యాటింగ్ చేసిందో అర్దం చేసుకోవచ్చు. నిన్న చివరి సెషన్ తప్ప భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఏ సెషన్ లోనూ ఆధిపత్యం కనపర్చలేక పోయింది. లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. కీలకమైన నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఓవల్ వేదికగా జరుగనుంది. అయితే, ఇంగ్లాండ్‌ టూర్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో టీమిండియా అద్భుతమైన ఆటతీరు చూపించింది. అయితే ఫాస్ట్ బౌలర్లు అదరగొట్టినా భారత జట్టులో కొన్ని సమస్యలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ, ఇంగ్లాండ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

  మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 501 పరుగులు చేసిన జో రూట్, భారత జట్టుని ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్‌ని త్వరగా పెవిలియన్ చేర్చి ఉంటే, ఇప్పటికే టీమిండియా 2-0 తేడాతో లీడ్‌లో ఉండేది.రవీంద్ర జడేజా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నా, కేవలం బ్యాటుతో కొన్ని పరుగులు చేస్తున్నాడనే కారణంగా అతన్నే కొనసాగించాడు విరాట్ కోహ్లీ. జట్టులో ప్రధాన స్పిన్నర్ లేకపోవడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది.రవీంద్ర జడేజాలాగే రవిచంద్రన్ అశ్విన్‌ కూడా బ్యాటుతో రాణించగలడు. అతనికి టెస్టుల్లో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. అన్నింటికీ ముఖ్యంగా అశ్విన్‌కి జో రూట్‌పై మంచి రికార్డు ఉంది. అలాంటి మ్యాచ్ విన్నర్‌ను పక్కనబెట్టడం చాలా పెద్ద వ్యూహాత్మిక తప్పిదం.

  అశ్విన్‌తో పాటు యంగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను ఎదుర్కోవడంలో కూడా జో రూట్ చాలా ఇబ్బందిపడ్డాడు. అశ్విన్, జడేజాల్లాగే అక్షర్ పటేల్ కూడా బ్యాటుతో మెరుపులు మెరిపించగలడు. అయితే జడేజా మీద చూపించిన ఇంట్రెస్ట్ ఈ ఇద్దరిపై పెట్టడం లేదు విరాట్ కోహ్లీ.ఇంగ్లాండ్ పిచ్‌లు స్వింగ్‌కి అద్భుతంగా సహకరిస్తాయి. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లు స్వింగ్ రాబట్టడంలో విఫలమయ్యారు. తొలి టెస్టులో స్వింగ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ను తీసుకుంది టీమిండియా.. అతను కీలక వికెట్లు తీసి, సత్తా చాటాడు కూడా.శార్దూల్ ఠాకూర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకూడదని విరాట్ కోహ్లీ, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవడంతో అతనికి తుదిజట్టులో చోటు దక్కలేదు.

  ఇది కూడా చదవండి :  వీడెవడండీ బాబూ..! ఈ సారి ప్యాడ్లు కట్టుకుని కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు..!

  అయితే మళ్లీ విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకూడదనే కారణంగా ఇషాంత్ శర్మను కొనసాగించింది భారత జట్టు. అతను 22 ఓవర్లు వేసినా, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అదీకాకుండా టెస్టుల్లో 4.20 రన్‌రేటుతో సమర్పించి ఘోరంగా విఫలమయ్యాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, రెండో టెస్టులో ఆకట్టుకున్నాడు. అయితే అప్పుడు కూడా అతనికి తొలి ఇన్నింగ్స్‌లో చాలా ఆలస్యంగా వికెట్లు దక్కాయి. అలాంటి ఇషాంత్‌కి మరో మ్యాచ్‌లో విశ్రాంతిని ఇచ్చి, శార్దూల్ ఠాకూర్‌ని ఆడించి ఉంటే, అటు బాల్‌తోనూ, ఇటు బ్యాటుతోనూ మంచి ఫలితం వచ్చి ఉండేది. ఓవల్‌లో జరిగే నాలుగో టెస్టులో టీమిండియా మార్పులు అనివార్యం కానున్నాయి. రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ ఖాయం అవుతుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

  ఇది కూడా చదవండి : పోలియోను జయించింది.. ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో నిలిచింది..

  బ్యాటింగ్‌లో వరుసగా విఫలం అవుతున్న ఛతేశ్వర్ పూజారా ఫామ్‌లోకి రావడం ఒక్కటే టీమిండియా అభిమానులకు సంతోషాన్ని కలిగించే అంశం. అయితే పూజారా ఫామ్‌లోకి వచ్చాడని సంతోషించేలోపు, కెఎల్ రాహుల్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ అయ్యాడు.నాలుగో టెస్టులో కెఎల్ రాహుల్ స్థానంలో పృథ్వీషాను ఆడించాలని విరాట్ కోహ్లీ భావిస్తాడా? లేక మొదటి రెండు టెస్టుల్లో పర్ఫామెన్స్ ఆధారంగా అతన్నే కొనసాగిస్తాడా? అనేది తేలాల్సి ఉంది. మిడిలార్డర్ లో ఫెయిలవుతున్న అజింక్య రహానే స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ని తీసుకుంటే మంచిదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. దూకుడుగా ఆడే సూర్య కుమార్ యాదవ్ కచ్చితంగా ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకువస్తాడని వారు అంచనా వేస్తున్నారు. అయితే, ఎవరి అంచనాలకు అందని విరాట్ కోహ్లీ.. నాలుగో టెస్ట్ కి ఎటువంటి కాంబినేషన్ పై దృష్టి పెడతాడో చూడాల్సిందే.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cheteswar Pujara, Cricket, India vs england, Prithvi shaw, Ravichandran Ashwin, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు