హోమ్ /వార్తలు /క్రీడలు /

Mohammed Siraj : గల్లీ బాయ్ సిరాజ్ గప్ చుప్ సెలబ్రేషన్స్ వెనుక ఉన్న కారణమిదే..!

Mohammed Siraj : గల్లీ బాయ్ సిరాజ్ గప్ చుప్ సెలబ్రేషన్స్ వెనుక ఉన్న కారణమిదే..!

Mohammed Siraj : హైదరాబాద్ గల్లీ బాయ్.. వికెట్​ తీసిన ప్రతిసారి.. బ్యాట్స్​మన్​వైపు చూస్తూ మౌనంగా వెళ్లిపోమ్మని.. పెదవులపై వేలు పెట్టుకుని సైగలు చేస్తున్నాడు. అయితే ఈ సెలెబ్రేషన్స్‌పై విమర్శలు వచ్చాయి.

  లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ ల మధ్య రెండో టెస్ట్ హోరాహోరీగా సాగుతోంది. ఆధిపత్యం కోసం ఇరు జట్లు నువ్వా- నేనా అన్నట్లు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ టెస్ట్ సిరీస్ లో హైదరబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) తన ప్రదర్శనతో మరోసారి ఆకట్టుకుంటున్నాడు. ఇక, మహ్మద్ సిరాజ్ కొత్త తరహా సెలబ్రేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండో టెస్ట్‌లో దుమ్మురేపుతున్న ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. వికెట్​ తీసిన ప్రతిసారి.. బ్యాట్స్​మన్​వైపు చూస్తూ మౌనంగా వెళ్లిపోమ్మని.. పెదవులపై వేలు పెట్టుకుని సైగలు చేస్తున్నాడు. అయితే ఈ సెలెబ్రేషన్స్‌పై విమర్శలు వచ్చాయి. దీనిని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. అంత అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇది సిరాజ్ స్థాయికి తగదంటున్నారు. ఇదే విషయాన్ని సిరాజ్ ముందు ప్రస్తావించగా.. తన సెలెబ్రేషన్స్ వెనుక ఉన్న కారణాన్ని అతను తెలియజేశాడు. మూడో రోజు ఆట తర్వాత మీడియాతో మాట్లాడిన సిరాజ్.. విమర్శకుల నోళ్లు మూయించేందుకు ఈ కొత్త తరహా సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. " నేను అలా వేడుక చేసుకోవడానికి కారణం నా విమర్శకులు. నేను ఏదీ చేయలేనని, నా గురించి చాలా చెబుతుంటారు. నన్ను ద్వేషించేవారికి నా బంతితోనే సమాధానం చెబుతా. అందుకే ఈ కొత్త తరహా ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్ చేసుకుంటున్నా" అని మహ్మద్​ సిరాజ్ చెప్పుకొచ్చాడు.

  లార్డ్స్‌లో తాను ఆడుతున్న తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే 4 వికెట్ల‌తో సిరాజ్ అద‌ర‌గొట్టాడు. ఇక రాహుల్‌పై గ్యాల‌రీలోని అభిమానులు సీసా బిరడా విస‌ర‌డంపై కూడా సిరాజ్ స్పందించాడు. ఆ విష‌యం గురించి త‌న‌కు పూర్తిగా తెలియ‌ద‌ని, అయితే వాళ్లు అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లైతే ఏమీ చేయ‌లేద‌ని చెప్పాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 27 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ దక్కింది. ఓవర్‌నైట్‌ స్కోరు 119/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (321 బంతుల్లో 18 ఫోర్లతో 180 నాటౌట్‌) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 7 ఫోర్లతో 57 ) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్‌ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఆట ముగిసింది.

  అయితే, నాలుగు రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే వరుస షాకులు తగిలాయ్. ఫామ్ లో ఉన్న టీమిడియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ త్వరగా పెవిలియన్ బాట పట్టారు. ఇక, టీమిండియా భారం మిడిలార్డర్ పైనే పడింది. ఫామ్ లో లేని పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే రాణిస్తే ఇంగ్లండ్ కు మంచి టార్గెట్ సెట్ చెయ్యచ్చు.

  First published:

  Tags: Cricket, India vs england, Mohammed Siraj, Sports, Virat kohli

  ఉత్తమ కథలు