Home /News /sports /

IND VS ENG SECOND TEST LIVE UPDATES ENGLAND WON THE TOSS AND ELECTED FIELD FIRST SRD

Ind Vs Eng : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మూడు మార్పులతో ఇంగ్లండ్..ఒక మార్పుతో బరిలోకి టీమిండియా..

England Vs India (Image: BCCI)

England Vs India (Image: BCCI)

Ind Vs Eng : టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగితే.. ఇంగ్లండ్ టీమ్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.

    ఇంగ్లండ్ పర్యటనలో రెండో టెస్ట్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఫస్ట్ టెస్ట్ లో గెలిచి.. విజయంతో సిరీస్ ను ప్రారంభించాలనుకున్న టీమిండియాకు ఆశలకు వరుణుడు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే.మొదటి టెస్ట్ చివరి రోజు వర్షంతో తుడిచిపెట్టుకపోయింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ విజయం దాదాపు ఖాయం అయినా.. ఆ క్రెడిట్ వరణుడి ఖాతాలోకి వెళ్లింది. ఇక రెండో టెస్ట్ లార్డ్స్ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా ఓపెనర్లు ఫర్వాలేదనిపించారు. జట్టుకు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. కేఎల్ రాహుల్ సూపర్ టచ్ లో ఉన్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. కోహ్లీ గోల్డెన్ డక్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చతేశ్వర్ పుజారా తన వైఫల్యాన్ని కొనసాగిస్తుండగా.. అజింక్య రహానే తడబడుతున్నాడు. రిషభ్ పంత్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. వీరు ఫామ్ అందుకుంటే భారత బ్యాటింగ్ విభాగం బలోపేతం కానుంది. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగితే.. ఇంగ్లండ్ టీమ్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.

    ఇక, ఏకైక స్పిన్నర్‌గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజాకే మరోసారి అవకాశం దక్కింది. ఫస్ట్ టెస్ట్‌లో జడేజా బౌలర్‌గా రాణించకపోయినా.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దీంతో, స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం అయ్యాడు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కింది.

    భారత్ తుది జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

    ఇంగ్లండ్ తుది జట్టు : రోరి బర్న్స్‌, డామ్‌ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, జొస్ బట్లర్‌ (కీపర్), సామ్‌ కరన్‌, ఓలీ రాబిన్‌సన్‌, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్‌.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs england, Jasprit Bumrah, Ravindra Jadeja, Rohit sharma, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు