ఫస్ట్ టెస్ట్ లో గెలిచి.. విజయంతో సిరీస్ ను ప్రారంభించాలనుకున్న టీమిండియా(Team India)కు ఆశలకు వరుణుడు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే.మొదటి టెస్ట్ చివరి రోజు వర్షంతో తుడిచిపెట్టుకపోయింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ విజయం దాదాపు ఖాయం అయినా.. ఆ క్రెడిట్ వరణుడి ఖాతాలోకి వెళ్లింది. ఇక లార్డ్స్ (Lords) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ కూడా మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి గంట ముందే వర్షం ప్రారంభమవడంతో టాస్కు ఆలస్యమైంది. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వడంతో అంపైర్లు టాస్ తతంగాన్ని పూర్తి చేశారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఓ మార్పు చోటు చేసుకోగా.. ఇంగ్లండ్ టీమ్‌లో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి రాగా.. వరుసగా విఫలమవుతున్న జాక్ క్రాలీ, డేనియల్ లారెన్స్ స్థానంలో హసీబ్ హమీద్, మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చారు. గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయిన సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బదులు మార్క్ వుడ్ బరిలోకి దిగాడు. ఇక ఆటగాళ్లు మైదానంలోకి దిగి మొదలుపెడదామనే సరికే వర్షం మళ్లీ మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపేసి మైదానాన్ని కవర్లతో కప్పేసారు. మళ్లీ బ్రేక్ ఇవ్వడంతో ఆట ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి : ఈ క్రికెటర్లు చాలా హాట్ గురూ! ఈ జనరేషన్ లో టాప్-10 హ్యాండ్సమ్ క్రికెటర్లు వీరే..
అయితే వర్షం కారణంగా అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇంగ్లండ్‌లో ఎవడ్రా మ్యాచ్‌లు పెట్టమన్నదని ఐసీసీపై మండిపడుతున్నారు. అసలు భారత్‌తో మ్యాచ్ అంటేనే వర్షం పడుతుందా? లేక వర్షం పడేటప్పుడు భారత్‌కు మ్యాచ్‌లు పెడతారా? అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. కాలంతో సంబంధం లేకుండా వాతావరణ ఉండే ఇంగ్లండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం నిషేధించాలని మరో అభిమాని అసహనం వ్యక్తం చేశాడు.
BAN Cricket in England
BAN Cricket in England
BAN Cricket in England
BAN Cricket in England
BAN Cricket in England
BAN Cricket in England #INDvENG #ENGvsIND
— ?????? ?? (@ImLibran14_) August 12, 2021
Holy shit it started raining again #ENGvIND #INDvENG
— Thala (@ThanduMadurai) August 12, 2021
Asalu Process Yenti Sir India Tho Matches Ante Varsham Padtunda, Leka Varsham Padetappudu India Ki Matches Pedtara...#INDvENG pic.twitter.com/w9CRmoFXDm
— SJVᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ? (@Javeed061198) August 12, 2021
వరుణుడి కారణంగా నాటింగ్‌హామ్ టెస్టులో గెలిచే అవకాశాన్ని కోల్పోయిన కోహ్లీసేన.. మలి టెస్టులో ఇంగ్లండ్‌పై పంజా విసరాలని చూస్తున్నది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్తాచాటేందుకు భారత్ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది. అయితే బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాను వేధిస్తోంది. ఇక, రెండో టెస్ట్ లో కూడా వరుణుడు ఇదే విధంగా అంతరాయం కలిగిస్తే టీమిండియాకు నష్టం జరిగే అవకాశముందని భారత ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
భారత్ తుది జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్ తుది జట్టు : రోరి బర్న్స్, డామ్ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, జొస్ బట్లర్ (కీపర్), సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Sports, Virat kohli