Home /News /sports /

IND VS ENG SECOND TEST 4TH DAY LIVE UPDATES TEAM INDIA IN DEEP TROUBLE IN LORDS TEST FOR LOSING 3 WICKETS IN JUST 56 RUNS SRD

Ind Vs Eng : కష్టాల్లో టీమిండియా.. మరోసారి నిరాశపర్చిన కోహ్లీ.. లంచ్ సమయానికి స్కోరు వివరాలు ఇలా..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Ind Vs Eng : ఈ మ్యాచ్‌లో నిలవాలంటే కనీసం ఈ రోజులో మిగిలిన రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది టీమిండియా. ప్రస్తుతం పుజారాతో పాటు రహానే క్రీజులో ఉన్నారు.

    లార్డ్స్ వేదికగా జరుగుతున్న టీమిండియా కష్టాల్లో పడింది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి మూడు వికెట్లు కోల్పోయి కేవలం 56 పరుగుల మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 29 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆఖరి బంతిని ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడంతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. 12 ఓవర్లలో 27 పరుగులు చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది. 30 బంతుల్లో 5 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ బాది జోరు మీద ఉన్నట్టు కనిపించిన రోహిత్ శర్మను సూపర్ ప్లాన్ వేసి ఇంగ్లండ్ ఔట్ చేసింది. మార్క్ వుడ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కి ప్రయత్నించి, మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక, క్రీజులోకి రాగానే.. చూడచక్కని షాట్‌తో ఖాతా తెరవడంతో పాటు భారత జట్టుకి ఆధిక్యాన్ని అందించిన విరాట్ కోహ్లీ 31 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా.

    ఇది కూడా చదవండి : గల్లీ బాయ్ సిరాజ్ గప్ చుప్ సెలబ్రేషన్స్ వెనుక ఉన్న కారణమిదే..!

    ప్రస్తుతం టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా మరోసారి తన జిడ్డు ఆటను కొనసాగిస్తున్నాడు. 35 బంతుల తర్వాత సింగిల్ తీసి ఖాతా తెరిచిన పూజారా... 46 బంతుల్లో కేవలం 3 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో నిలవాలంటే కనీసం ఈ రోజులో రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది టీమిండియా. ప్రస్తుతం పుజారాతో పాటు రహానే క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ రాణిస్తేనే టీమిండియా మంచి స్థితిలో ఉండే అవకాశం ఉంది.


    ఇక, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 27 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ దక్కింది. ఓవర్‌నైట్‌ స్కోరు 119/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (321 బంతుల్లో 18 ఫోర్లతో 180 నాటౌట్‌) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 7 ఫోర్లతో 57 ) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్‌ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఆట ముగిసింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cheteswar Pujara, Cricket, India vs england, KL Rahul, Rohit sharma, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు