Ind Vs Eng : " తీవ్ర నొప్పి వేధిస్తోన్న నువ్వు ఆడిన ఆటకు.. నీ కమిట్‌మెంట్ కు సెల్యూట్ "..

Photo Credit : Twitter

Ind Vs Eng : ఈ సెంచరీ ఇన్నింగ్స్ వెనుక రోహిత్ తీవ్ర నొప్పిని అనుభవించాడు. 353 నిమిషాలపాటు క్రీజులో నిలుచున్న రోహిత్ శర్మ తొడలు కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడంతో రెండు తొడలు ఎర్రగా కమిలిపోయాయి.

  • Share this:
    ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ (India Vs England) లో టీమిండియా స్టార్‌ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్‌) అద్భుత శతకంతో జట్టును పటిష్ట స్థితికి చేర్చిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ 94 పరుగుల వద్ద మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది కెరీర్‌లో తొలి ఓవర్‌సీస్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా రోహిత్‌కిది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. అయితే ఈ సెంచరీ ఇన్నింగ్స్ వెనుక రోహిత్ తీవ్ర నొప్పిని అనుభవించాడు. 353 నిమిషాలపాటు క్రీజులో నిలుచున్న రోహిత్ శర్మ తొడలు కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడంతో రెండు తొడలు ఎర్రగా కమిలిపోయాయి. ఔటైన అనంతరం తొడలపైన అయిన గాయాలకు రోహిత్ చికిత్స తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కష్టం ఊరికేపోదని, రోహిత్ ఇన్నింగ్సే ఇందుకు ఉదహారణని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ కమిట్‌మెంట్ హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అతని గాయానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ సెల్యూట్ చేస్తున్నారు.

    సుదీర్ఘ ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై హిట్‌మ్యాన్‌కు ఇది ఫస్ట్ సెంచరీ అవ్వగా.. మొత్తంగా ఎనిమిదోది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ బాదడం ద్వారా పలు రికార్డులను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన హిట్‌మ్యాన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.


    అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్‌ 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా (246 ఇన్నింగ్స్‌ల్లో)11 వేల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా రోహిత్ నిలవగా.. అతని కంటే ముందు సచిన్ తెందూల్కర్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్‌ 241 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు.

    ఇది కూాడా చదవండి : హద్దులు దాటి గ్లామర్ డోస్ పెంచిన షమీ భార్య.. దారుణమైన ట్రోలింగ్..

    మరోవైపు, ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్ట్‌పై టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలిసారి ఒకరోజు మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో కదంతొక్కితే... చతేశ్వర్‌ పుజారా (127 బంతుల్లో 9 ఫోర్లతో 61), కేఎల్‌ రాహుల్‌ (101 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) తమ వంతు పాత్ర పోషించారు. దీంతో మూడో రోజు 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. నాలుగో రోజు టీమిండియా బ్యాట్స్ మన్ రెండు సెషన్ల పాటు ఆడితే.. మ్యాచ్ లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంటుంది.
    Published by:Sridhar Reddy
    First published: