Viral Video : ఓ వైపు రహానే సీరియస్ గా బ్యాటింగ్ చేస్తుంటే..పంత్ ఏం చేస్తున్నాడో చూడండి..

Photo Credit : Twitter

Viral Video : ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు మాత్రమే చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు.

 • Share this:
  మూడో టెస్టులో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై (England) ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. కోహ్లీ (Virat Kohli) నుంచి సిరాజ్ (Mohammed Siraj) వరకు కేవలం 54 నిమిషాల్లో పెవీలియన్ చేరిపోయారంటే భారత జట్టు ఎంత దారుణంగా బ్యాటింగ్ చేసిందో అర్దం చేసుకోవచ్చు. లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. కీలకమైన నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఓవల్ వేదికగా జరగనుంది. అయితే, మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట సందర్భంగా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రహానే (Ajinkye Rahanae) సీరియస్ గా బ్యాటింగ్‌ చేస్తుండగా, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న పంత్‌.. తనకేదీ పట్టదన్నట్లుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ (షాడో బ్యాటింగ్) చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అండర్సన్ బంతిని సంధించాక పంత్ అప్పటికప్పుడు అప్రమత్తమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పంత్ షాడో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసి రహానే క్రీజు నుంచి ఎందుకు పక్కకు తప్పుకోలేదని కొందరు ప్రశ్నిస్తుంటే, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌ నుంచే అండర్సన్‌ను ఎదుర్కొనేందుకు పంత్‌ సిద్ధమయ్యాడంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ ఏందో నెట్స్ లో చేసి ఉంటే బాగా రాణించేవాడివంటూ పంత్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

  అయితే, ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు మాత్రమే చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ రెండుసార్లు రాబిన్సన్‌కే దొరికిపోయాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్‌.. గత కొన్ని మ్యాచ్‌లుగా వరుసగా విఫలమవుతూ టీమిండియా చోటును మళ్లీ ప్రశ్నార్ధకంగా మార్చుకునేలా ఉన్నాడు. ప్రస్తుత సిరీస్‌లో పంత్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు.

  ఇది కూడా చదవండి :  మీ ప్రియుడు మీ పట్ల ప్రేమతో ఉన్నాడా..? లేక అతనిది వ్యామోహమా..?.. ఇలా తెలుసుకోండి..


  మరోవైపు, మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి నాలుగో టెస్ట్ లో టీమిండియాలో సమూల మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చాడు. దీంతో నాలుగో టెస్ట్ లో ఎవరిపై వేటు పడనుందో అర్ధం కావటం లేదు. కేఎల్ రాహుల్ ను వికెట్ కీపర్ గా తీసుకుని.. పృథ్వీషా తో ఓపెనింగ్ చేయించే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక, నాలుగో టెస్ట్ లో అశ్విన్ ను కచ్చితంగా తుది జట్టులో చూడొచ్చు. ఎందుకంటే టీమిండియాపై వీరవీహారం చేస్తోన్న జో రూట్ ను కట్టడి చేయాలంటే అశ్విన్ తుది జట్టులో ఉండటం తప్పనిసరి అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్, పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్ లకు జట్టులో చోటు దక్కే ఛాన్సులు ఉన్నాయని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: