ఇంగ్లాండ్-ఇండియా (India Vs England) మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బాగా ఫేమస్ అయిన వ్యక్తి జార్వో (Jarvo 69). ఎంతలా అంటే.. ఇక, ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జార్వోకి వచ్చిన క్రేజ్ ఎవరికి రాలేదంటే అతిశయోక్తి కాదు. ఒకే టెస్టు సిరీస్‌లో సెక్యూరిటీని దాటుకొని మూడు సార్లు మైదానంలోకి వచ్చిన జార్వో సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయిడు. పదే పదే ఆయన ఇలా చేస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఫ్రాంక్ స్టార్‌గా మంచి గుర్తింపు ఉన్న జార్వో అసలు పేరు డేనియల్ జార్విస్. బీఎండబ్ల్యూ జార్వో పేరుతో జార్వో నడుపుతున్న యూ ట్యూబ్‌చానెల్‌కు లక్ష మంది సబ్‌స్క్రైబర్స్ ఉండడం విశేషం. వృత్తి పరంగా కమెడియన్, ఫిల్మ్ మేకర్, ఫ్రాంక్‌స్టార్‌గా రాణిస్తున్నాడు. ఇక, లార్డ్స్ టెస్ట్ లో ఫీల్డర్ గా వచ్చిన జార్వో.. ఆ తర్వాత మ్యాచ్ లో బ్యాట్లు కట్టుకుని బ్యాట్స్ మన్ లా ఎంట్రీ ఇచ్చాడు. ఇక, నాలుగో టెస్ట్ లో నాలుగో టెస్టులో భారత జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో జార్వో మరోసారి మైదానంలోకి ప్రవేశించాడు. బంతిని చేతితో పట్టుకొని పరుగెత్తుకుంటూ వచ్చి నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోను (Johnny Bairstow) బలంగా ఢీకొట్టాడు. ఇలా, బౌలర్ లా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు జార్వో.
అయితే, తర్వాత జరిగే.. ఆఖరి టెస్ట్ లో జార్వో ఇలా వస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఫీల్డర్, బ్యాట్స్ మన్, బౌలర్ లా వచ్చిన జార్వో.. ఈ సారి అంపైర్ గా వస్తాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జార్వో దూకుడు చూస్తుంటే.. ఆఖరి టెస్ట్ లో ఫీల్డ్ అంపైర్ లా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
JARVO 69 IS BACK AND READY TO BAT.
????????? pic.twitter.com/OLr3r0P0SQ
— Cricket Mate. (@CricketMate_) August 27, 2021
Jarvo again!!! Wants to bowl this time ??#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f
— Raghav Padia (@raghav_padia) September 3, 2021
12 men for #TeamIndia - ‘Jarvo 69' Almost convincing security he was there to play ?#ENGvIND #INDvENG #INDvsENG pic.twitter.com/oOFVe1d3bJ
— Karamdeep (@oyeekd) August 14, 2021
ఇప్పటికే, హెడింగ్లేలో చేసిన పనికి యార్క్‌షైర్ కౌంటీ అతడిపై జీవిత కాలం నిషేధం విధించింది. ఇక ఇప్పుడు ఓవల్ సిబ్బంది మాత్రం అతడిపై మామూలు చర్యలు తీసుకోవడానికి నిరాకరించింది. ఏకంగా లండన్ పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు వచ్చే వరకు సిబ్బంది అతడిని స్టేడియంలోనే బంధించారు. ఆ తర్వాత ఆటగాళ్లపై దాడి చేశారని చెబుతూ లండన్ పోలీసులకు అప్పగించారు.
కియా ఓవల్ సిబ్బంది పిర్యాదు మేరకు జార్వోపై లండన్ పోలీసులు అనుమానాస్పద దాడి కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 'ఒక వ్యక్తిని మేము ఓవల్ క్రికెట్ గ్రౌండ్ వద్ద శుక్రవారం అరెస్టు చేశాము. ప్రస్తుతం అతడు సౌత్ లండన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు' అని మెట్రొపాలిటన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. జార్వో 69 కారణంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ డిస్ట్రబ్ అయ్యిందని ఓలీ పోప్ మ్యాచ్ అనంతరం పేర్కొనడం గమనార్హం. మరి, అభిమానుల కల నెరవేర్చడానికైనా.. జార్వో ఫీల్డ్ అంపైర్ లా వస్తాడో లేదో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Sports, Viral Videos