Home /News /sports /

IND VS ENG LORDS TEST INTRUDER JARVO ANOTHER FUNNY VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA TAKE A LOOK SRD

Viral Video : వీడెవడండీ బాబూ..! మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లోనే మకాం వేశాడు..

Photo Credit : You Tube

Photo Credit : You Tube

Viral Video : ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మూడో రోజు లంచ్‌ విరామం ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

    ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మూడో రోజు లంచ్‌ విరామం ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి వచ్చిన జార్వో అనే ఒక అభిమాని టీమిండియా ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వెళ్లిపోయి నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. మొదట జార్వోని గుర్తుపట్టలేకపోయినప్పటికీ ఆ తర్వాత తేరుకున్న భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని తీసుకెళ్లారు. భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయింది. అయితే, జార్వో ఇలాంటి పనులు చేయడం కొత్త కాదట. ఇంతకు ముందు కూడా మనోడి ఇలాంటివి చాలానే చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా జార్వోచేసిన మరోపని లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది.


    అది ఎప్పుడు జరిగిందన్నది తెలియకపోయినప్పటికి.. వీడియో ప్రకారం అది ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ అని తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బౌలర్‌ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్‌ చేసి మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్‌లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్‌ చూపించాడు. ఆ తర్వాత జార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది.

    ఇక లార్డ్స్‌ టెస్టులో 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్ టీమ్ ను చిత్తు చేసింది టీమిండియా. ఐదు టెస్ట్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కోహ్లీసేన. ఇక మూడో టెస్ట్ ఈ నెల 25 నుంచి లీడ్స్ వేదికగా జరగనుంది. అయితే మూడో టెస్టుకు 8 రోజుల గ్యాప్‌ వచ్చింది. దీంతో భారత ఆటగాళ్లు.. తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs england, Sports, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు