ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా.. మూడు వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. భారత్‌కు శుభారంభం అందించారు. తొలి సెషన్లో నెమ్మదిగా పరుగులు సాధించారు. అయితే రెండో సెషన్లో కరోహిత్ శర్మ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. అయితే టీమిండియా స్కోర్ 126 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. 44వ ఓవర్లో అండర్సన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(145 బంతుల్లో 83 పరుగులు) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పూజారా(23 బంతుల్లో 9 పరుగులు).. కాసేపటికే పెవిలియన్ చేరాడు. 50వ ఓవర్లో అండర్సన్ వేసిన అఖరి బంతికి.. స్లిప్‌లో దొరికిపోయాడు. దీంతో టీమిండియా 150 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఇక, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లి.. కేఎల్ రాహుల్‌తో కలిసి వేగంగా ఆడారు. ఈ సమయంలోనే కేఎల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి, రాహుల్ ఇద్దరు కలిసి.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. అయితే 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. 85వ ఓవర్లో రాబిన్సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 267 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అజింక్యా రహానే క్రీజ్‌లో వచ్చాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్(127 పరుగులు), రహానె(1 పరుగు)తో నాటౌట్‌గా నిలిచారు.
ఇక, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో విజయానికి చేరువలో నిలిచిన టీమిండియా.. వర్షం కారణంగా గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో.. మిగిలిని నాలుగు మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. అయితే వరుణుడి కారణంగా.. తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో, ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి బోణి కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.