పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయాడు. పవర్ స్టార్ నటిస్తున్న సినిమాలు వరసగా షూటింగ్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా అన్నింటికంటే షూటింగ్ ముందుగా పూర్తి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అది గ్రాఫిక్స్ ప్లస్ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడుకున్న భారీ సినిమా కావడంతో కొన్ని రోజులు దాన్ని పక్కనబెట్టాడు పవన్. దానికంటే ముందు మరో సినిమాను పూర్తి చేస్తున్నాడు. అదే అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్. రానా, పవన్ హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తయింది.తాజాగా ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలైంది. చాలా రోజుల కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ సెట్లో అడుగు పెట్టారు పవన్, రానా. దీనికి సంబంధించిన అఫీషియల్ మేకింగ్ వీడియో కూడా విడుదలైంది. అందులో పవన్ భీమ్లా నాయక్‌గా కనిపిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఇగో ప్రధాన కథగా ఈ చిత్రం వస్తుంది. దీనికి టైటిల్ ఇంకా పెట్టలేదు. పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇక, ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో.. పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా చేస్తోంది. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ ఇన్స్పెక్టర్ గెటప్‌లో కనిపించారు. రీమేక్‌లో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పేరు భీమ్లా నాయక్. ఆయన ధరించిన ఎస్ఐ గెటప్పైనా ఈ నేమ్‌బ్యాడ్జ్ కనిపిస్తుంది. 2022 సంక్రాంతికి భీమ్లా నాయక్ ఛార్జ్ తీసుకోబోతోన్నాడంటూ సితార ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్.. కోట్లాదిమంది పవన్ కల్యాణ్ అభిమానులను ఇఫ్పటి నుంచే ఎదురు చూసేలా చేసింది.
#BheemlaNayak ?@PawanKalyan #PSPKRana
— Hanuma vihari (@Hanumavihari) July 27, 2021
ఈ ఫ్యాన్స్‌లో టీమిండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నాడు. కాకినాడకు చెందిన హనుమ విహారి ఇది వరకు పవన్ కల్యాణ్‌ను కలిసి ఫొటోలు సైతం తీసుకున్నాడు. పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీపై సితార ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చిన ఈ అప్డేట్ హనుమ విహారిని కూడా ఆకాశంలో విహరింపజేసినట్టుంది. అందుకే- ఇంగ్లాండ్‌లో ఉన్నా పవన్ కల్యాణ్‌పై తనకు ఉన్న అభిమానాన్ని దాచుకోలేకపోయాడతను. ఈ వీడియో షేర్ అయిన వెంటనే.. భీమ్లా నాయక్, పవన్ కల్యాణ్, పీఎస్పీకే రానా అనే పేర్లను మెన్షన్ చేస్తూ ఓ ట్వీట్ వదిలాడు. భీమ్లా నాయక్ ఆన్ ఫైర్ అనే మెసేజీని పంపించాడు.ఇక, హనుమ విహారీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. భీమ్లా నాయక్ లుక్ విడుదలైన వెంటనే తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పని చెప్పాడు. పవన్ కల్యాణ్‌కు బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hanuma vihari, India vs england, Pawan kalyan, Power star pawan kalyan, Tollywood news