• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IND VS ENG GUJARAT MAN THREATENS TO SELF IMMOLATE IF T20 SERIES IS NOT CANCELLED SRD GH

IND vs ENG : భారత్-ఇంగ్లండ్ సిరీస్ ఆపేయాల్సిందే..! ఆగంతకుడి బెదిరింపు కాల్ తో పోలీసులు అలర్ట్..

India vs England

IND vs ENG : దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ మంది ప్రజలు ఒకే దగ్గర చేరే ఈవెంట్లు, క్రీడా మైదానాలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీమ్ ఇండియా టీ20 సిరీస్‌ను నిలిపేయాలని ఒక వ్యక్తి పోలీసులను బెదిరించాడు.

  • Share this:
దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ మంది ప్రజలు ఒకే దగ్గర చేరే ఈవెంట్లు, క్రీడా మైదానాలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీమ్ ఇండియా టీ20 సిరీస్‌ను నిలిపేయాలని ఒక వ్యక్తి పోలీసులను బెదిరించాడు. గుజరాత్‌లోని మొతెరా స్టేడియంలో ప్రస్తుతం టీ20 సిరీస్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. స్టేడియం సెక్యూరిటీ ఆఫీసర్‌ కేవీ పటేల్‌కు ఫోన్ చేసిన వ్యక్తి.. కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందువల్ల మ్యాచ్‌లు ఆపేయాలని చెప్పాడు. లేదంటే నిరసనగా బలిదానం చేసుకుంటానని బెదిరించాడు. ఇంగ్లండ్-ఇండియా మధ్య టీ20 సిరీస్‌ మార్చి 12న ప్రారంభమైంది. అదేరోజు గాంధీనగర్‌కు చెందిన పంకజ్ పటేల్ అనే వ్యక్తి సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ కేవీ పటేల్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ కాల్ రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అహ్మదాబాద్‌లోని చంద్ ఖేడా పోలీస్ స్టేషన్‌లో పంకజ్‌పై FIR నమోదు చేశారు. ప్రస్తుత టీ20 టోర్నీకి కేవీ పటేల్ సెక్యూరిటీ ఇన్‌చార్జిగా ఉన్నారు.

* FIR నమోదు
పంకజ్ పోలీసు అధికారికి ఫోన్ చేసి.. స్టేడియంలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తున్నారా? అని ప్రశ్నించాడు. దీంతో సామాజిక దూరం గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని ఆయన చెప్పారు. మ్యాచ్‌లు చూడటానికి 75,000 మంది ప్రేక్షకులు వస్తున్నారని, వారి ఆరోగ్యానికి ముప్పు ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌లను ఆపేయాలని పంకజ్ తెలిపాడు. లేదంటే నిరసనగా బలిదానం చేసుకుంటానని చెప్పాడు. అతడి గురించి పూర్తి వివరాలు అడగ్గా.. గాంధీనగర్‌ నుంచి ఫోన్ చేస్తున్నానని వెల్లడించాడు. దీంతో కేవీ పటేల్ గాంధీనగర్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి.. బెదిరింపు కాల్ గురించి ఫిర్యాదు చేశారు.

ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి, FIR నమోదు చేశామని అధికారులు తెలిపారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. మలి దశలో కరోనా కేసులను నియంత్రించడంలో విఫలమైనందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌ను కూడా పంకజ్ దూషించాడు. ఈ వివరాలను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
Published by:Sridhar Reddy
First published: