ఓవల్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ (India Vs England) లో టీమిండియా పట్టు సాధిస్తోంది. వెలుతురు లేమి కారణంగా గంట ముందుగానే మూడో రోజు ఆట ముగిసింది. వెలుతురు సహకరించకపోవడంతో అంపైర్లు డేను కాల్ ఆఫ్ చేశారు. ఇక, మూడో రోజు ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది టీమిండియా. ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (Virat Kohli Batting) (37 బంతుల్లో 22 పరుగులు), రవీంద్ర జడేజా (33 బంతుల్లో 9 పరుగులు) ఉన్నారు. రోహిత్ శర్మ (Rohit Sharma) (127 పరుగులు.. 256 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్), పుజారా ( 61 పరుగులు.. 127 బంతుల్లో 9 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అండర్సన్ కు ఒక వికెట్ దక్కింది. 256 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 127 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రాబిన్‌సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, క్రిస్ వోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్‌లో మూడు సార్లు ఫుల్ షాట్‌కి ప్రయత్నించి అవుటైన రోహిత్, ఈసారి కూడా అలానే అవుట్ కావడం విశేషం... కొత్త బంతిని తీసుకున్న తర్వాతి తొలి డెలివరీకే ఇంగ్లాండ్‌కి వికెట్ దక్కడం విశేషం.
రెండో వికెట్‌కి ఛతేశ్వర్ పూజారాతో కలిసి 278 బంతుల్లో 153 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత నాలుగో బంతికి ఛతేశ్వర్ పూజారా కూడా అవుటయ్యాడు. 127 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేసిన పూజారా, రాబిన్‌సన్ బౌలింగ్‌లో మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 237 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా.
? STUMPS ?
That's it for day three, a very good one for India, with no improvement in the light at the Kia Oval.
??? Stay with Sky Sports Cricket for the reaction. https://t.co/6B5RJoVvu5
— Sky Sports Cricket (@SkyCricket) September 4, 2021
ఇక, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ.. రికార్డుల మోత మోగించాడు. మూడు వేల టెస్టు పరుగులను పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ, 15 వేల అంతర్జాతీయ పరుగులతో పాటు మొట్టమొదటి ఓవర్‌సీస్ సెంచరీని అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఇంగ్లాండ్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ.
2021 క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్‌గానూ నిలిచాడు రోహిత్ శర్మ. ఈ ఏడాది జో రూట్, బాబర్ ఆజమ్, రిజ్వాన్ వెయ్యికి పైగా పరుగులు సాధించిన వారిలో ఉన్నారు. ఓపెనర్‌గా 11 వేల పరుగులు అందుకున్న రోహిత్ శర్మ, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఇది కూడా చదవండి : హద్దులు దాటి గ్లామర్ డోస్ పెంచిన షమీ భార్య.. దారుణమైన ట్రోలింగ్..
ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 700+ పైగా బంతులను ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ. తన కెరీర్‌లోనే ఇది అత్యధికం. ఇంతకుముందు 2019లో భారత్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధికంగా 683 బంతులు ఆడాడు రోహిత్.ఇంగ్లాండ్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 18వ సారి 50+ స్కోరు చేసిన రోహిత్ శర్మ... అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheteswar Pujara, Cricket, IND VS ENG, India vs england, Rohit sharma, Virat kohli