IND VS ENG FOURTH TEST UPDATES SHARDUL THAKUR CREATES THIS RECORDS AS NO 8 BATSMAN SRD
Ind Vs Eng : శార్దూల్ ఠాకూర్ సరికొత్త రికార్డు.. ఎనిమిదో స్థానంలో వచ్చి..
Shardul Thakur (BCCI Twitter)
Ind Vs Eng :ఓవల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మన్ విఫలమైన చోట శార్దూల్ 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు.
ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ (India Vs England) లో టీమిండియా(Team India) భారీ టార్గెట్ ను ఇంగ్లండ్ ముందుంచింది. 466 పరుగులు చేసి ఆలౌట్ అయింది కోహ్లీసేన. ఓవరాల్ గా 367 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే 368 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచిన శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur), రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 72 బంతుల్లో 60 పరుగులు చేసి శభాష్ అన్పించాడు. అయితే, ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్ సరికొత్త రికార్డును అందుకున్నాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన నాలుగో టీమిండియా బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్( వర్సెస్ న్యూజిలాండ్ , అహ్మదాబాద్, 2010); భువనేశ్వర్ కుమార్( వర్సెస్ ఇంగ్లండ్, నాటింగ్హమ్, 2014); వృద్ధిమాన్ సాహా( వర్సెస్ న్యూజిలాండ్, కోల్‌కతా, 2016) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇక ఓవల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మన్ విఫలమైన చోట శార్దూల్ 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. 72 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు.
శార్దూల్ ఠాకూర్ తో పాటు పంత్ (Rishabh Pant) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 106 బంతుల్లో 50 పరుగులు చేసి ఈ సిరీస్ లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు పంత్. వీరితో పాటు ఆఖర్లో బుమ్రా, ఉమేశ్ యాదవ్ మెరుపులు మెరిపించడంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. క్రిస్ వోక్స్ మూడు వికెట్లు, మొయిన్ అలీ 2, ఓలీ రాబిన్సన్ 2 వికెట్లు తీశారు.
Indian No.8 or lower batsmen scoring two 50+ scores in a Test match:
Harbhajan Singh v NZ, Ahmedabad, 2010
Bhuvneshwar Kumar v Eng, Nottingham, 2014
W Saha v NZ, Kolkata, 2016
Shardul Thakur v Eng, The Oval, 2021*#ENGvIND
ఇక, పిచ్ నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదు. దీంతో టీమిండియా ఇంగ్లండ్ ను ఎలా కట్టడి చేస్తోందో వేచి చూడాలి. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఐదు మ్యాచ్ ల సిరీస్ లో రెండు జట్లు 1-1 తో సమంగా నిలిచాయ్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.