హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Eng : నాలుగో టెస్ట్ లో టీమిండియా కమ్ బ్యాక్.. జో రూట్ ఔట్.. తొలి రోజు స్కోరు వివరాలు ఇలా..

Ind Vs Eng : నాలుగో టెస్ట్ లో టీమిండియా కమ్ బ్యాక్.. జో రూట్ ఔట్.. తొలి రోజు స్కోరు వివరాలు ఇలా..

Team India

Team India

Ind Vs Eng : ఓవల్ వేదికగా ఇంగ్లండ్ (England) తో జరుగుతున్న నాలుగో టెస్ట్ ‌(Ind Vs Eng) లో టీమిండియా (Team India) కమ్ బ్యాక్ ఇచ్చింది. బ్యాటింగ్ లో నిరాశపర్చిన టీమిండియా బౌలింగ్ లో అదరగొడుతోంది.

ఓవల్ వేదికగా ఇంగ్లండ్ (England) తో జరుగుతున్న నాలుగో టెస్ట్ ‌(Ind Vs Eng) లో టీమిండియా (Team India) కమ్ బ్యాక్ ఇచ్చింది. బ్యాటింగ్ లో నిరాశపర్చిన టీమిండియా బౌలింగ్ లో అదరగొడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 53 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రెండు వికెట్లు దక్కించుకోగా.. ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) కీలకమైన జో రూట్ (Joe Root) ను పెవిలియన్ పంపాడు. మూడు సెంచరీలతో ఈ సిరీస్ లో భీకర ఫామ్ లో ఉన్న జో రూట్ 25 బంతుల్లో 21 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మలన్ తో పాటు క్రెగ్ ఓవర్టన్ ఉన్నారు. ఓవర్టన్ నైట్ వాచ్ మ్యాన్ గా బరిలోకి దిగాడు. ఇక, అంతకు ముందు..127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శార్దూల్ (Shardul Thakur) తన ధనాధన్ బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో 8వ వికెట్‌కు ఉమేశ్ యాదవ్(10)తో కలిసి 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏడు ఫోర్లు, 3 సిక్సర్లతో వీరవిహారం చేశాడు.

రాబిన్సన్ వేసిన 60వ ఓవర్‌లో4, 6 బాదిన శార్దూల్.. 31 బంతుల్లో కెరీర్‌లో రెండో అర్థశతకం అందుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇక శార్దూల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50) మినహా మరేవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/55), ఓలి రాబిన్సన్(3/38) భారత్ పతనాన్ని శాసించగా.. జేమ్స్ అండర్సన్, క్రైగ్ ఓవర్టన్ చెరొక వికెట్ తీశారు.

మరోవైపు , శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన శార్దూల్.. తద్వార టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టాడు.

ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో ఉండగా.. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి మూడో బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ నిలిచాడు. ఇప్పటి వరకు ఇయాన్ బోథమ్(32 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండగా.. శార్దూల్ అతన్ని అధిగమించాడు. 1986లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనే ఇయాన్ బోథమ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

First published:

Tags: Cricket, India vs england, Jasprit Bumrah, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు