IND VS ENG FOURTH TEST LIVE UPDATES TEAM INDIA ALL OUT FOR 191 RUNS AND SHARDUL THAKUR SCORES FIERY HALF CENTURY SRD
Ind Vs Eng : శార్దూల్ ధనాధన్ ఇన్నింగ్స్.. టీమిండియా ఆలౌట్.. స్కోరు వివరాలు ఇలా..
Shardul Thakur (BCCI Twitter)
Ind Vs Eng : టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) విరుచుకుపడ్డాడు. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ టీ20ని తలపించాడు. అతడి దెబ్బకు స్కోరు బోర్డు పరుగులు తీసింది.
ఇంగ్లండ్ (India Vs England)తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా (Team India) ఆలౌటై అయింది. టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) విరుచుకుపడ్డాడు. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ టీ20ని తలపించాడు. అతడి దెబ్బకు స్కోరు బోర్డు పరుగులు తీసింది. 36 బంతుల్లోనే 7 పోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన ఠాకూర్.. క్రిస్ వోక్స్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో ఉన్నంత సేపు బంతిని నలువైపులా బాదుతూ స్కోరును పరుగులుపెట్టించాడు. అతడి దెబ్బకు 127గా ఉన్న స్కోరు అవుటయ్యే సరికి 190కి చేరుకుంది. శార్దూల్ అవుటైన బుమ్రా బంతులేమీ ఆడకుండానే అదే స్కోరు వద్ద రనౌట్ కాగా, ఒక్క పరుగు జోడించాక ఉమేశ్ యాదవ్ (10) పెవిలియన్ చేరడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 191 పరుగులకు ఆలౌటై అయింది. కోహ్లీ (Virat Kohli)హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
విరాట్ కోహ్లీ(96 బంతుల్లో 8 ఫోర్లతో 50) పరుగులు చేశాడు.హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జోరు కనబర్చిన విరాట్.. ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. అతను వేసిన 43వ ఓవర్ ఐదో బంతిని అంచనా వేయలేకపోయిన కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. ఎక్స్ట్రా బౌన్స్ అయిన బంతి కోహ్లీ బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్ బెయిర్ స్టో చేతిలో పడింది. ఈ సిరీస్‌లో రాబిన్సన్ బౌలింగ్‌లో విరాట్ ఔటవ్వడం ఇది మూడోసారి.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తన ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ(11)ను పెవిలియన్ చేర్చాడు. ఎక్స్ట్రా బౌన్స్‌తో క్రీజులో కుదురుకుంటున్న హిట్ మ్యాన్‌ను బొల్తా కొట్టించాడు. దాంతో 28 రన్స్‌కే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పుజారా క్రీజులోకి రాగా.. ఆ వెంటనే కేఎల్ రాహుల్(17)ను రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
Innings Break#TeamIndia have been bowled out for 191 (Virat 50, Shardul 57) in 61.3 overs after being asked to bat first in the fourth Test. Stay tuned as our bowlers will be in action soon.
రాబిన్సన్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను తప్పుగా అంచనా వేసిన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. పుజారా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. జిడ్డు బ్యాటింగ్‌తో ఇక క్రీజులో పాతుకుపోతున్న పుజారాను అండర్సన్ తనదైన బౌలింగ్‌తో బోల్తాకొట్టించాడు.
6⃣! 💪
Thakur (39no) is taking the attack to the England bowlers! Here he smashes Woakes for the second six so far of his 25-ball knock.
దాంతో టీమిండియా మేనేజ్మెంట్ లెఫ్టాండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇస్తూ బ్యాటింగ్ పంపించింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఫస్ట్ సెషన్ ముగించారు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత క్రిస్ వోక్స్ మంచి సెటప్‌తో జడేజాను బోల్తా కొట్టించాడు.
వ్యూహాత్మకంగా బంతులు సంధించి వికెట్ సాధించాడు. వైవిధ్యమైన బంతులతో జడేజా అయోమయానికి గురిచేసి ఔట్ చేశాడు. అతను వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌ను తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత రహానే, పంత్ కూడా పూర్తిగా నిరాశపర్చారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.