Ind Vs Eng : మూడో టెస్ట్ సీన్ రిపీట్.. కష్టాల్లో కోహ్లీసేన.. లంచ్ సమయానికి స్కోరు వివరాలు ఇలా..

Photo Credit : BCCI Twitter

Ind Vs Eng : అయితే, ఆశ్చర్యకరంగా ఫోర్త్ డౌన్ లో రహానే స్థానంలో జడేజాని బ్యాటింగ్ కు దింపింది టీమిండియా. ఈ మూవ్ టీమిండియాకు కలిస్తోందో లేదో వేచి చూడాలి.

 • Share this:
  ఫస్ట్ టెస్ట్‌లో విజయాన్ని తృటిలో చేజార్చుకొని.. రెండో టెస్ట్‌లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఇంగ్లండ్ (England) గడ్డపై జోరు కనబర్చిన కోహ్లీ సేన (Team India Updates).. మూడో మ్యాచ్ లో చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్ల ఔట్‌ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌‌కు చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్ దారుణ ఓటమికి కారణమయ్యారు. ఇక, కెన్నింగ్టన్ ఓవల్‌ మైదానంలో భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం అయింది. ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్‌ జో రూట్‌ (Joe Root) తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, మరోసారి టీమిండియా కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (Virat Kohli Batting) (18 పరుగులు), జడేజా (Ravindra Jadeja) (2 పరుగులు) ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ (Rohit Sharma Out)(11) ఔటయ్యాడు. క్రిస్‌ వోక్స్‌ వేసిన 9వ ఓవర్‌ చివరి బంతికి అతడు పెవిలియన్‌ చేరాడు. బంతి బ్యాట్‌ అంచులకు తాకుతూ వెళ్లగా కీపర్‌ జానీ బయిరిస్టో క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో భారత్‌ 28 పరుగులకు తొలి వికెట్‌ కోల్పోయింది.

  ఆ తర్వాత ఓలి రాబిన్‌సన్‌ వేసిన 11.6 ఓవర్‌కు బంతి లోకేష్ రాహుల్‌ కాలికి తాకడంతో ఇంగ్లండ్ రివ్యూకు వెళ్లింది. అక్కడ వికెట్లకంటే పైకి వెళ్లేలా తేలడంతో రాహుల్‌ నాటౌట్‌గా నిలిచాడు. అయితే రాబిన్‌సన్‌ వేసిన 13.5 ఓవర్‌కు రాహుల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 28 పరుగులకే రెండో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడినా ఛతేశ్వర్ పుజారా మూడో వికెట్ గా వెనుదిరిగాడు. 31 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసినా పుజారా జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో కీపర్ బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.


  అయితే, ఆశ్చర్యకరంగా ఫోర్త్ డౌన్ లో రహానే స్థానంలో జడేజాని బ్యాటింగ్ కు దింపింది టీమిండియా. ఈ మూవ్ టీమిండియాకు కలిస్తోందో లేదో వేచి చూడాలి. లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా జడేజా, కోహ్లీ జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తనదైన స్టైల్ లో డ్రైవ్ లు ఆడుతూ టచ్ లో వచ్చినట్లు కన్పించాడు.
  ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ జ‌ట్టు రెండు మార్పులు చేసింది. జోస్ బ‌ట్ల‌ర్‌, సామ్ కరన్ స్థానంలో ఒలీ పోప్‌, క్రిస్ వోక్స్ వ‌చ్చారు. మరోవైపు భార‌త జ‌ట్టులో కూడా రెండు మార్పులు జ‌రిగాయి. సీనియర్ పేసర్లు ఇషాంత్ శ‌ర్మ‌, మొహ్మద్ ష‌మీ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్‌, ఉమేశ్ యాద‌వ్‌లు జ‌ట్టులోకి వచ్చారు. దీంతో సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin)కు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో టీమిండియా ఎంపికపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: