Ind Vs Eng : ఫస్ట్ సెషన్ లో మూడు వికెట్లు ఢమాల్.. కోహ్లీ కూడా ఔట్.. ఆ ఇద్దరిపైనే ఆశలు..

Photo Credit : Twitter

Ind Vs Eng : ఓవల్ వేదిక గా జరుగుతున్న నాలుగో టెస్టు (India Vs England) నాలుగో రోజు మరోసారి టీమిండియా తడబడింది. మార్నింగ్ సెషన్ లో టీమిండియా (Team India) వేగంగా మూడు వికెట్లు కోల్పోయింది.

  • Share this:
    ఓవల్ వేదిక గా జరుగుతున్న నాలుగో టెస్టు (India Vs England) నాలుగో రోజు మరోసారి టీమిండియా తడబడింది. మార్నింగ్ సెషన్ లో టీమిండియా (Team India) వేగంగా మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామానికి ఆరు వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది టీమిండియా. ప్రస్తుతం టీమిండియా 230 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (16 పరుగులు), శార్దూల్ ఠాకూర్ (11 పరుగులు) తో ఉన్నారు. ఇక, ఓవర్‌నైట్ స్కోరు 270/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 296 పరుగుల వద్ద వరుసగా రవీంద్ర జడేజా (17), అజింక్య రహానే (0) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ కోహ్లీ (Virat Kohli)అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ కరువు తీరుస్తాడనుకున్న వేళ 44 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్ లో స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా, అజింక్య రహానే ఇద్దరూ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. రహానే తన చెత్త ఫామ్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇక, రెండో సెషన్ లో రిషబ్ పంత్, శార్దూల్ బ్యాటింగ్ పైనే టీమిండియా ఆశలన్నీ. మరో 100 పరుగులు సాధిస్తేనే కానీ.. టీమిండియా ఈ మ్యాచ్ లో గెలవడం కష్టం. అంతకుముందు భారీ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు రోహిత్ శర్మ.

    మరోవైపు, టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో రవితోపాటు మరో ముగ్గురిని ఐసోలేషన్‌కు పంపారు. వీరిలో ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో నితిన్ పటేల్ ఉన్నారు. వీరందరినీ జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ నెల 10 భారత్-ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యులు మాంచెస్టర్ వెళ్లినా, ఐసోలేషన్‌లో ఉన్న ఈ నలుగురు మాత్రం లండన్‌లోనే ఉంటారు.


    ఆటగాళ్లు, ఇతర జట్టు సిబ్బందికి రెండు లేటరల్ ఫ్లో టెస్టులు నిర్వహించగా రవిశాస్త్రికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మిగతా వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో నాలుగో టెస్టు కొనసాగేందుకు ఎలాంటి ఆటంకం కలగలేదు. రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్, నితిన్ పటేల్‌ను మెడికల్ టీం నిన్న సాయంత్రం ఐసోలేట్ చేసినట్టు బీసీసీఐ తెలిపింది.

    ఇది కూడా చదవండి : చిన్న వయస్సులోనే పోలియో.. అయినా కృంగిపోలేదు.. అతని జీవితం అందరికీ ఆదర్శం..

    వారందరూ జట్టు హోటల్ రూములోనే ఉంటారని, టీమిండియాతో కలిసి వారు ఎక్కడికీ ప్రయాణించడానికి వీల్లేదని పేర్కొంది. గతరాత్రి ఒకటి, ఈ ఉదయం ఒకటి మొత్తం రెండు టెస్టులు టెస్టులు నిర్వహించగా ఆటగాళ్లందరికీ నెగటివ్ రిపోర్టు వచ్చాయని, దీంతో నాలుగో టెస్టు నాలుగో రోజు ఆడేందుకు అనుమతి లభించిందని పేర్కొంది.
    Published by:Sridhar Reddy
    First published: