Home /News /sports /

IND VS ENG FORMER TEAM INDIA CRICKETER VVS LAXMAN SUGGESTS THIS ADVICE TO VIRAT KOHLI FOR FOURTH TEST SRD

Ind Vs Eng : నాలుగో టెస్ట్ కు ముందు కోహ్లీకి వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన అడ్వైజ్ ఇదే..!

Virat Kohli

Virat Kohli

Ind Vs Eng : ఓవల్ వేదికగా గురువారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం విజయ ఉత్సాహంలో ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతుండగా.. దెబ్బతిన్న పులిలా గర్జించేందుకు భారత ఆటగాళ్లు సమాయత్తం అవుతున్నారు.

  మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా (India Vs England) ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై (England) ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే ఈ ఘోరపరాజయాన్ని మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫస్ట్ టెస్ట్‌లో విజయాన్ని తృటిలో చేజార్చుకొని.. రెండో టెస్ట్‌లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఇంగ్లండ్ గడ్డపై జోరు కనబర్చిన కోహ్లీ సేన (Team India).. మూడో మ్యాచ్ లో చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్ల ఔట్‌ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌‌కు చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్ దారుణ ఓటమికి కారణమయ్యారు. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు రెడీ అవుతున్నాయ్ ఇరు జట్లు. ఓవల్ వేదికగా గురువారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం విజయ ఉత్సాహంలో ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతుండగా.. దెబ్బతిన్న పులిలా గర్జించేందుకు భారత ఆటగాళ్లు సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఓవల్ మైదానంలోని రికార్డులు భారత జట్టును కలవరపెడుతున్నాయి. ఈ సందర్భంగా సొగసరి బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.

  ఇంగ్లండ్‌ గడ్డపై దారుణంగా విఫలమవుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkye Rahane)కు దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అండగా నిలిచాడు. వైస్ కెప్టెన్‌గా అతని సేవలు జట్టుకు అవసరమని చెప్పాడు.

  అలాగే నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగాలన్నాడు. మూడో టెస్ట్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే కోహ్లీసేన ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైందని, ఆ బలహీనతను అధిగమించేందుకు ఐదుగురు బౌలర్ల సూత్రాన్ని పక్కనపెట్టి ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలన్నాడు.

  వీవీఎస్ లక్ష్మణ్


  ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులు ఆలౌటైన తర్వాత రహానే కెప్టెన్‌గా జట్టును గెలిపించాడనే విషయాన్ని మరవద్దన్నాడు. మెల్‌బోర్న్ వేదికగా అతను చేసిన సెంచరీ.. టీమ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సహాయపడిందని, అంతేకాకుండా కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కోహ్లీకి రహానే అండగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.

  ఇక, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన విరాట్.. మూడో మ్యాచ్‌లో గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక కొత్త బంతిని ఆడలేకపోయిన భారత బ్యాటింగ్ లైనప్ 78 పరుగులకే చుట్టేచేసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ బౌలర్లు వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను భారత బ్యాట్స్‌మన్ ఆడలేకపోయాడు.

  ఇది కూడా చదవండి : వైడ్ ఇవ్వని అంపైర్... కోపంలో పొలార్డ్‌ ఏం చేశాడో చూడండి..

  అయితే కీపర్ క్యాచ్ లేదంటే స్లిప్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. ఓపెనర్లు మినహా మిగతా బ్యాట్స్‌మన్ పెద్దగా రాణించడం లేదు. మిడిలార్డర్‌లో ఎవరూ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ క్రమంలోనే ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.

  ఇది కూడా చదవండి : వలలో చిక్కుకున్న ఆ 157 చేపలతో కోటీశ్వరుడు అయ్యాడు.. ఒక్కో చేప ఖరీదు ఎంతంటే..!

  ఇక నాలుగో టెస్ట్‌లో రెండు మార్పులతో టీమిండియా దిగడం ఖాయంగా కన్పిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్ దాదాపు తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ఇక, శార్దూల్ ఠాకూర్ మరియు విహారీ (లేదా) సూర్యల్లో మరొకరు జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్ట్ ఓటమి తర్వాత.. మార్పులు ఖాయమని ఇప్పటికే కోహ్లీ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, India vs england, Virat kohli, VVS Laxman

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు