Ind Vs Eng : ఇదే కదా టీమిండియా ఫ్యాన్స్ కు కావాల్సింది..! రోహిత్ సెంచరీకి.. కోహ్లీ రియాక్షన్ చూశారా..!

Rohit Sharma

Ind Vs Eng : భారత జట్టును ముందుండి నడింపించే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయన్నది మీడియాలో చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. ఇది చాలదన్నట్లు ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తరచూ తలపడుతుందటారు. మైగానంలో ఈ ఇద్దరి ఆటగాళ్ల ప్రవర్తన కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది.

 • Share this:
  టీమిండియా (Team India) కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇద్దరూ అత్యంత విలువైన ఆటగాళ్లు. మూడు ఫార్మెట్లలోనే టీమిండియాను టాప్ ప్లేస్‌లో నిలపడంలో ఇద్దరిదీ కీలక పాత్ర. భారత జట్టును ముందుండి నడింపించే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయన్నది మీడియాలో చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. ఇది చాలదన్నట్లు ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తరచూ తలపడుతుందటారు. మైదానంలో ఈ ఇద్దరి ఆటగాళ్ల ప్రవర్తన కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఐపీఎల్ 2020 (IPL) సీజన్ సందర్బంగా ఒకరినొకరు కనీసం చూసుకోకపోవడం.. ఆస్ట్రేలియా పర్యటన సందర్బంగా రోహిత్ గాయం గురించి తనకు పూర్తి సమాచారం లేదని విరాట్ కోహ్లీ ప్రకటించడం అందర్నీ విస్మయ పరిచింది. వీరి మధ్య విభేదాలు నిజమేనని నమ్మేలా చేశాయి. కానీ తాజా ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ మధ్య ఉన్న చనువు చూస్తుంటే వీరి మధ్య గొడవలు సమసిపోయాయని, మంచి స్నేహితులయ్యారనే విషయం స్పష్టం అవుతుంది.

  ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో(India Vs England) రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. కెరీర్‌లో తొలి ఓవర్‌సీస్ శతకాన్ని అందుకున్నాడు. మొయిన్ అలీ వేసిన 64వ ఓవర్ ఐదో బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదిన రోహిత్... 204 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. రోహిత్ సెంచరీకి గ్యాలరీలోని ఆటగాళ్లు, కోచ్‌లు స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే తానే సెంచరీ చేసినంత ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదే కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

  లార్డ్స్ టెస్ట్‌లో కోహ్లీ ట్రేడ్ మార్క్ రివ్యూకు కీలక జానీ బెయిర్ స్టో ఔటవ్వడంతో రోహిత్ భారత కెప్టెన్‌ను హగ్ చేసుకొని మరి అభినందించాడు. ఈ వీడియో కూడా అప్పట్లో నెట్టింట హల్‌చల్ చేసింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లో కోహ్లీ తీసుకున్న ఒంటెత్తు పోకడ రివ్యూలన్నీ ప్రతికూల ఫలితాలిచ్చాయి.


  ఆ క్రమంలోనే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్ స్టో రివ్యూను కూడా ఇతర ఆటగాళ్లంతా వారించారు. కానీ కోహ్లీ మాత్రం ఎవరి మాట వినకుండా రివ్యూ తీసుకొని ఫలితం రాబట్టాడు. దీంతో అతన్ని సహచర ఆటగాళ్లంతా అభినందించారు. ఆ క్రమంలోనే రోహిత్ శర్మ హగ్ చేసుకొని మరి మెచ్చుకున్నాడు. ఇదే వారి మధ్య ఉన్న మంచి సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది.

  ఇది కూడా చదవండి : చిన్న వయస్సులోనే పోలియో.. అయినా కృంగిపోలేదు.. అతని జీవితం అందరికీ ఆదర్శం..

  ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. రోహిత్ శర్మ(256 బంతుల్లో 14 ఫోర్లతో ఒక సిక్స్‌తో 127) సెంచరీతో చెలరేగగా.. చతేశ్వర్ పుజారా(127 బంతుల్లో 9 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 171 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది టీమిండియా.
  Published by:Sridhar Reddy
  First published: